2021 జనవరి 6 క్యాపిటల్ హిల్ దాడి కుట్రపూరితమే
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంపు పోటీపై నిషేధం విధించాలన్న విచారణ కమిటీ
విధాత: 2021 జవవరి అమెరికా క్యాపిటల్ హిల్ పై దాడి నాటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రేరేపితమేనని విచారణ కమిటీ తేల్చింది. ట్రంప్ చేసిన కుట్రపూరిత చర్యలకు గాను ఆయనను తిరిగి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని సిఫారసు చేసింది.
అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించేది లేదన్న ట్రంప్, ప్రదర్శనలతో ఎన్నికల ఫలితాలను అడ్డుకోవాలని తన మద్దతు దారులకు పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలో 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు.
అమెరికా చరిత్రలో ఇలా క్యాపిటల్ హిల్‌పై దాడి చేయటం ఇదే మొదటి సారి. దీన్ని అమెరికా పార్లమెంటుతో పాటు పౌరసమాజం తీవ్రంగా పరిగణించింది. జనవరి 6 కమిటీ పేరుతో అమెరికా ప్రతినిధుల సభ సభ్యులతో ఓ విచారణ కమిటీ వేసింది.
ఈ కమిటీ 18నెలలు వెయ్యి మందికి పైగా సాక్షులను విచారించింది. క్యాపిటల్ హిల్ దాడి కుట్ర పూరితమేనని తెలిపింది. ఓటమిని అంగీకరించలేక ట్రంప్ తన మద్దతుధారులకు హింసాత్మక దాడులకు పురిగొల్పాడని తేల్చింది.
2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయి జో బైడెన్ గెలిచారు. అయితే ఎన్నికల్లో, ఫలితాల ప్రకటనలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. కాబట్టి తాను అధ్యక్షుడిగా గద్దె దిగేది లేదని మొండికేసి కూర్చున్నారు. దీంతో అమెరికా అధ్యక్ష భవన అధికారులు ట్రంప్‌ను బలవంతంగా అధ్యక్ష భవనం నుంచి ఖాళీ చేయించాల్సి వచ్చింది.