Bangalore | డాక్ట‌ర్‌, ఇంజినీర్‌గా చెప్పుకొని.. 9 ఏళ్ల‌లో 15 మందితో వివాహం

Bangalore క‌ర్ణాట‌క‌లో ఓ వ్య‌క్తి ఘ‌రానా మోసం బాధిత మ‌హిళ‌లంద‌రూ చ‌దువుకున్న‌వారు, ఉద్యోగినులే.. విధాత‌: త‌న‌ను తాను డాక్ట‌ర్‌, ఇంజినీర్‌గా చెప్పుకొంటూ 2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 15 మందిని పెళ్లి చేసుకున్న వ్య‌క్తిని క‌ర్ణాట‌క పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌డిని 35 ఏళ్ల మ‌హేశ్ కేబీ నాయ‌క్‌గా గుర్తించారు. చివ‌రి సారిగా 2023 మొద‌ట్లో సాఫ్ట‌వేర్ ఉద్యోగం చేసే యువ‌తిని పెళ్లి చేసుకోగా.. అమె ఇటీవ‌ల ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. […]

  • Publish Date - July 10, 2023 / 10:27 AM IST

Bangalore

  • క‌ర్ణాట‌క‌లో ఓ వ్య‌క్తి ఘ‌రానా మోసం
  • బాధిత మ‌హిళ‌లంద‌రూ చ‌దువుకున్న‌వారు, ఉద్యోగినులే..

విధాత‌: త‌న‌ను తాను డాక్ట‌ర్‌, ఇంజినీర్‌గా చెప్పుకొంటూ 2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 15 మందిని పెళ్లి చేసుకున్న వ్య‌క్తిని క‌ర్ణాట‌క పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌డిని 35 ఏళ్ల మ‌హేశ్ కేబీ నాయ‌క్‌గా గుర్తించారు. చివ‌రి సారిగా 2023 మొద‌ట్లో సాఫ్ట‌వేర్ ఉద్యోగం చేసే యువ‌తిని పెళ్లి చేసుకోగా.. అమె ఇటీవ‌ల ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు.

తీగ లాగితే డొంక క‌దిలిన చందంగా అత‌డి గ‌త చ‌రిత్రను తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. అత‌డికి ఇంగ్లీష్ కనుక కొంచెం బాగా వ‌చ్చుంటే మ‌రింత మంది మ‌హిళ‌ల‌ను వ‌ల‌లో వేసుకునేవాడ‌ని పోలీసులు చెప్ప‌డం కొస‌మెరుపు. నిందితుడు పెళ్లి కావ‌ల్సిన అమ్మాయిల కోసం మ్యాట్రిమొనీ సైట్ల‌లో సెర్చ్ చేసేవాడ‌ని పోలీసులు గుర్తించారు. చాలా సంద‌ర్భాల్లో త‌న‌ను తాను డాక్ట‌ర్‌గా ఇంజినీర్‌గా ప‌రిచ‌యం చేసుకునేవాడ‌ని తెలిపారు.

అయితే అత‌డు మాట్లాడిన వారిలో చాలా మంది యువ‌తులు నిందితుడి ఇంగ్లీష్ చూసి పెళ్లిల్ల‌కు నిరాక‌రించార‌ని పేర్కొన్నారు. తాజాగా ఈ ఏడాది మైసూరు యువ‌తిని పెళ్లి చేసుకోగా.. తన భ‌ర్త శారీరికంగా మాన‌సికంగా వేధిస్తున్నాడ‌ని, క్లినిక్ పెట్టుకోవ‌డానికి డ‌బ్బులు డిమాండ్ చేసేవాడ‌ని, కొన్ని రోజుల త‌ర్వాత త‌న న‌గ‌లు తీసుకుని పారిపోయాడ‌ని ఫిర్యాదు చేసింది. పోలీసులు ద‌ర్యాప్తు చేస్తుండ‌గానే అదే వ్య‌క్తిపై మ‌రో ఫిర్యాదు రావ‌డంతో ద‌ర్యాప్తుపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టారు.

మ‌హేశ్ ఒక‌రితో ఉంటూనే మ‌రొక‌రితో పెళ్లికి సిద్ధ‌ప‌డేవాడని పోలీసులు గుర్తించారు. అత‌డ్ని పెళ్లి చేసుకున్న అమ్మాయిలంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుండ‌టంతో డ‌బ్బు కోసం ఇత‌డిని అడిగేవారు కాదు. తాము మోస‌పోయామ‌ని కొద్ది కాలానికి గుర్తించిన‌ప్ప‌టికీ స‌మాజానికి భ‌య‌ప‌డి ఫిర్యాదు చేయ‌లేద‌ని పోలీసులు తెలిపారు.ఈ 15 మందిలో న‌లుగురు మ‌హిళ‌ల‌తో అత‌డు సంతానం పొందాడ‌ని పేర్కొన్నారు.

Latest News