తోటకు కంచెగా బతుకమ్మ చీరలు

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలు మహిళలను ఆకట్టుకునేలా లేకపోవడంతో వాటిని తీసుకున్న వారు రకరకాలుగా వినియోగిస్తున్నారు

విధాత : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలు మహిళలను ఆకట్టుకునేలా లేకపోవడంతో వాటిని తీసుకున్న వారు రకరకాలుగా వినియోగిస్తున్నారు. నూతనకల్ మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో ఓ రైతు బతుకమ్మ చీరలు వద్దనుకున్న వారి నుంచి వాటిని సేకరించి తోటకు కంచెగా ఏర్పాటు చేసుకున్నాడు. రైతు చర్యపైన, బతుకమ్మ చీరల నాణ్యతపైన ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.