Site icon vidhaatha

Bigg Boss7 | ఊహించిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్‌లోకి.. మొత్తం ఎంత‌మంది వెళ్లారంటే..!

Bigg Boss7 |

గ‌త కొద్ది రోజులుగా బిగ్ బాస్ సీజ‌న్ 7కి సంబంధించి అనేక ప్రోమోలు విడుద‌ల చేసి షోపై చాలా ఆస‌క్తి పెంచారు. ఎపుడెప్పుడు షో మొద‌లవుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 3న బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఎప్ప‌టి మాదిరిగానే ఒక్కో కంటెస్టెంట్‌ని ప‌రిచ‌యం చేస్తూ హౌజ్‌లోకి ప్ర‌వేశ‌పెట్టారు. ముందుగా ‘పొట్టి పిల్లా’ అనే సాంగ్‌తో ప్రియాంక సంద‌డి చేసి హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే ప్రియాంక తొలి కంటెస్టెంట్ కాబ‌ట్టి ఆమెకి కొన్ని సూచ‌న‌లు చేసి పంపించాడు. మీరు ఇంకా కంటెస్టెంట్స్‌గా ఫైన‌ల్ కాలేద‌ని చెప్పిన నాగ్..హౌజ్‌లోకి వెళ్లాక సౌక‌ర్యాలు సంపాదించుకోవ‌ల్సి ఉంటుంద‌ని తెలిపారు. పవర్ అస్త్ర గురించి కూడా వివ‌రించారు. అనంత‌రం ప్రియాంక బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లింది.

Kushi | మొదటి ఆప్షన్ సమంత కాదట.. నిజంగా ఆ హీరోయిన్ చేసి ఉంటేనా.. నా సామిరంగా..!

ఇక రెండో కంటెస్టెంట్‌గా ఒకప్ప‌టి హీరో శివాజి ఎంట్రీ ఇచ్చాడు .తన తొలి చెక్‌ నాగార్జున చేతుల మీదుగానే అందుకున్నానని, ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే ప్రారంభమవుతుందని ఆయ‌న పేర్కొన్నాడు.

మూడో కంటెస్టెంట్‌గా ఫేమ‌స్ సింగర్‌ దామిని ఎంట్రీ ఇచ్చింది. ‘ఎల్‌పచీనో..’ అంటూ తనదైన స్టయిలీష్‌ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆమె పాట‌ల‌తో ఉర్రూత‌లూగించింది. నువ్వు ఇంక కంటెస్టెంట్‌గా ఫైనల్‌ కాలేదని, పవర్‌ అస్త్రాని సొంతం చేసుకుంటే కంటెస్టెంట్‌గా ఛాన్స్ ద‌క్కుతుంద‌ని నాగ్ అన్నారు. ఇక నాల్గో కంటెస్టెంట్‌గా ఆర్టిస్ట్ మోడల్‌ ప్రిన్స్ యావర్‌ ఎంట్రీ ఇవ్వ‌గా, ఆయ‌న త‌న సిక్స్ ప్యాక్‌తో కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఐదో కంటెస్టెంట్‌గా లాయర్‌, నటి శుభ శ్రీ రాయగురు వ‌చ్చి సంద‌డి చేసింది. రెడ్‌ డ్రెస్‌లో ఆద్యంతం కట్టిపడేసిన ఈ భామ పవర్‌ అస్త్రాని గెలుచుకొని కంటెస్టెంట్‌గా ఫైన‌ల్ కావాల‌ని తెలిపారు నాగార్జున. ఇక ఆరో కంటెస్టెంట్‌గా శృంగార తార ష‌కీలా ఎంట్రీ ఇవ్వడం విశేషం. త‌నే ఏవీని చూపించ‌గా, అది చూసి అంద‌రు ఎమోష‌న‌ల్ అయ్యారు. ఇక ష‌కీలా దత్తత తీసుకున్న ఇద్దరు ట్రాన్స్ జెండర్లు కూడా వేదిక‌ పైకి వ‌చ్చి ఆమె గొప్ప‌త‌నం తెలియ‌జేశారు.

ఇక ఏడో కంటెస్టెంట్‌గా కొరియోగ్రాఫర్‌, డాన్సర్‌ సందీప్‌ ఎంట్రీ ఇచ్చారు. ఎనిమిదో కంటెస్టెంట్‌గా ‘కార్తీక దీపం’ నటి శోభా శెట్టి , తొమ్మిదో కంటెస్టెంట్‌గా యూట్యూబర్‌ ‘టేస్టీ’ తేజ , హీరోయిన్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ రతిక పదో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పదకొండో కంటెస్టెంట్‌గా డాక్టర్‌ గౌతమ్‌ కృష్ణ , నటి కిరణ్‌ రాథోర్ , పదమూడో కంటెస్టెట్‌గా రైతు బిడ్డ, యూట్యూబర్‌ పల్లవి ప్రశాంత్ సీజన్ 7లోకి అడుగుపెట్టారు.

Meenakshi Chaudhary | ఘాటెక్కిన అందం.. రెడ్ క‌లర్ డ్రెస్‌లో గుబులు రేపుతున్న మీనాక్షి

టీవీ నటుడు అమర్‌ దీప్‌ 14వ కంటెస్టెంట్‌గా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గా, ఆయ‌న తన భార్య తేజూని చాలా మిస్‌ అవుతున్నట్టు చెప్పాడు . ఇలా ఆదివారం రోజు ఈ 14 మంది కంటెస్టెంట్లని పరిచయం చేశాడు నాగ్‌. మిగిలిన వారిని ఈ రోజు రాత్రి ప్ర‌సారం అయ్యే ఎపిసోడ్ లో ప‌రిచ‌యం చేసే అవ‌కాశం ఉంది.

అయితే ఆదివారం ఎపిసోడ్‌లో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ హౌజ్‌లోకి వెళ్లి సంద‌డి చేశారు. హీరో నవీన్‌ పొలిశెట్టిని కూడా నాగార్జున బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఆయ‌న కంటెస్టెంట్‌గా వెళ్లాడా, లేక త‌ను న‌టించిన మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి ప్ర‌మోష‌న్ కోసం వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది.

Rashmika | ర‌ష్మిక కాళ్ల‌పై ప‌డ్డ నూత‌న వ‌ధూవ‌రులు.. వారు అలా ఎందుకు చేశారంటే..!

Exit mobile version