Maoist Stupas: చత్తీస్ గఢ్ లో మావోయిస్టుల స్థూపాల కూల్చివేత

విధాత : మావోయిస్టుల నిర్మూలనకు ఆపరేషన్ కగార్ తో వరుస ఎన్ కౌంటర్లు కొనసాగిస్తున్న భద్రత బలగాలు పనిలో పనిగా ఆదివాసీ గ్రామాల్లోని మావోయిస్టుల స్మారక స్తూపాలను కూడా నిర్మూలిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు స్మారక స్తూపాన్ని భద్రతా బలగాలు కూల్చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. బంగోలి గ్రామ సమీపంలోని ఇంద్రావతి నది ప్రాంతంలో భద్రతా బలగాలు స్తూపాన్ని గుర్తించాయి. 15 అడుగుల ఎత్తైన మావోయిస్టుల స్మారక స్తూపాన్నిభద్రతా బలగాలు కూల్చివేశాయి. స్మారక స్థూపాలను […]

విధాత : మావోయిస్టుల నిర్మూలనకు ఆపరేషన్ కగార్ తో వరుస ఎన్ కౌంటర్లు కొనసాగిస్తున్న భద్రత బలగాలు పనిలో పనిగా ఆదివాసీ గ్రామాల్లోని మావోయిస్టుల స్మారక స్తూపాలను కూడా నిర్మూలిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు స్మారక స్తూపాన్ని భద్రతా బలగాలు కూల్చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. బంగోలి గ్రామ సమీపంలోని ఇంద్రావతి నది ప్రాంతంలో భద్రతా బలగాలు స్తూపాన్ని గుర్తించాయి. 15 అడుగుల ఎత్తైన మావోయిస్టుల స్మారక స్తూపాన్నిభద్రతా బలగాలు కూల్చివేశాయి. స్మారక స్థూపాలను ఏర్పాటు చేసి వాటి వద్ధ శ్రద్దాంజలుల పేరిట మావోయిజాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారని..ఈరకమైన చర్యలతో మళ్లీ మావోయిజం ప్రజ్వరిల్లకుంగా స్మారక స్థూపాలను తొలగిస్తున్నామని భద్రతాధికారులు తెలిపారు.

పర్యాటక కేంద్రంగా కర్రిగుట్టలు

అంతేకాకుండా చత్తీస్ గఢ్ లో వర్షాకాలంలో అడవుల్లో సంచారం కష్టంగా మారనుండటంలో గతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ ను నిలిపివేశారు. అయితే ఈ వర్షకాలంలో మాత్రం ఆపరేషన్ కొనసాగుతుందని ఇప్పటికే భద్రతా బలగాలు ప్రకటించడం విశేషం. అటు కర్రిగుట్టలను జల్లెడ పట్టి మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన భద్రతా బలగాలు మళ్లీ అక్కడ మావోయిస్టుల సంచారం లేకుంగా బేస్ క్యాంపులను ఏర్పాటు చేశాయి. కర్రిగుట్టలు తిరిగి మావోయిస్టుల షెల్టర్ గా మారకుండా కర్రిగుట్టలను పర్యాటక కేంద్రంగా మార్చడంతో పాటు సాయుధ దళాల శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సమాచారం.