విధాత: మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. అక్కడ ఆయన లేకపోవడంతో.. గంగుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. సీబీఐ అధికారులు రాకముందే మంత్రి కరీంనగర్ ఉంచి హైదరాబాద్ వెళ్లారు.
శ్వేత గ్రానైట్స్‌కు సంబంధించి ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై కొన్నిరోజుల ముందు ఈడీ అధికారులు గంగుల ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో సీబీఐ అధికారులు ఆయన ఇంటికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
రాష్ట్రంలో మంత్రుల ఇళ్లపై, కార్యాలయాలపై కొన్నిరోజులుగా ఈడీ, ఐటీ, సీబీఐ అధికారుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఈడీ, ఐటీ అధికారుల సోదాలు, వారి కుటుంబసభ్యులు, వారి సంస్థల్లో పనిచేసే సిబ్బందికి నోటీసులు ఇచ్చారు.
ప్రస్తుతం వారు విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి సీబీఐ అధికాలు వెళ్లడం కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీ, ఈడీ దాడులు జరగవచ్చు భయపడవద్దని తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెప్పిన తర్వాత నుంచి ఈ దాడులు ఎక్కువ అవడం గమనార్హం.
మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రలకు నోటీసులు
మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రలకు CBI నోటీసులు జారీ చేసి, రేపు విచారణకు హాజరుకావాలని కోరింది. తెలంగాణలో సీబీఐ విచారణకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఢిల్లీ సీబీఐ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.