CERT-In | ఆ ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వర్షన్లలో లోపాలు.. యూజర్లకు కేంద్రం హెచ్చరికలు..!

CERT-In | ఇటీవల స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌ ఒక నిత్యావసర వస్తువుగా మారింది. ఈ క్రమంలోనే సైబర్‌దాడులు సైతం పెరిగాయి. మాటల్లో పెట్టి.. ఆఫర్‌ పేరుతో ఎరవేసి అకౌంట్లను ఊడ్చేస్తున్నారు. దాంతో పాటు పర్సనల్‌ డేటా, ఫొటోలు, వీడియోలు సైతం హ్యాకర్ల బారిన పడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో లోపాలే ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఆండ్రాయిడ్‌-13కి సంబంధించి భద్రతా లోపాలున్నాయని కేంద్రం టెక్నాలజీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ […]

  • Publish Date - August 15, 2023 / 01:59 AM IST

CERT-In |

ఇటీవల స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌ ఒక నిత్యావసర వస్తువుగా మారింది. ఈ క్రమంలోనే సైబర్‌దాడులు సైతం పెరిగాయి. మాటల్లో పెట్టి.. ఆఫర్‌ పేరుతో ఎరవేసి అకౌంట్లను ఊడ్చేస్తున్నారు.

దాంతో పాటు పర్సనల్‌ డేటా, ఫొటోలు, వీడియోలు సైతం హ్యాకర్ల బారిన పడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో లోపాలే ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాజాగా ఆండ్రాయిడ్‌-13కి సంబంధించి భద్రతా లోపాలున్నాయని కేంద్రం టెక్నాలజీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ మేరకు యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌లో లోపాలున్నాయని, దాంతో హ్యాకర్ల బారినపడే అవకాశాలున్నాయని పేర్కొంది.

అప్రమత్తంగా ఉండాలంటూ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (Computer Emergency Response Team (CERT-In) హెచ్చరికలు జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పని చేస్తున్నది.

అయితే, ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో మల్టిపుల్‌ లోపాలు ఉన్నాయని CERT గుర్తించింది. అయితే, లోపాలు ఒక్క ఆండ్రాయిడ్‌ 13 మాత్రమే కాకుండా.. 10, 11, 12, 12ఎల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లోనూ పలు లోపాలు ఉన్నాయని పేర్కొంది. హ్యాకర్ల దాడికి గురి కాకుండా చర్యలు తీసుకోవాలని సంస్థ సూచించింది.

ఇందు కోసం మొబైల్స్‌ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ముఖ్యంగా గూగుల్‌ ఇప్పటికే సెక్యూరిటీ ప్యాచ్‌లను ఇడుదల చేసిందని, వివరాల కోసం వినియోగదారులు ఆండ్రాయిడ్‌ సెక్యూరిటీ బులెటిన్-ఆగస్టు 2023ను పరిశీలించాలని సూచించింది.

Latest News