Raghava Lawrence | ‘చంద్రముఖి 2’.. లారెన్స్ క్షమాపణలు చెప్పేశాడు

Raghava Lawrence | 2005లో వచ్చిన చంద్రముఖి అనగానే కళ్ళింత చేసుకుని గుర్రగా చింపిరి జుట్టుతో తమిళ భాషలో దెయ్యం మాట్లాడే మాటలే గుర్తుకొస్తాయి. ఆ పాత్ర చేసిన జ్యోతిక అలా ముద్రపడిపోయింది చాలామందికి. ఈ సినిమాలోని ‘చంద్రముఖి’ క్యారెక్టర్‌లో ఎందరో కనిపించినా కూడా జ్యోతిక నటన ముందు అనుష్క లాంటి వారు కూడా తేలిపోయారు. అలాంటి సినిమాకు సీక్వెల్ రాబోతుందని.. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ నటించబోతున్నారనే వార్త తెలిసినప్పటి నుంచి.. ఏదో రకంగా ఈ […]

  • Publish Date - August 29, 2023 / 01:45 AM IST

Raghava Lawrence |

2005లో వచ్చిన చంద్రముఖి అనగానే కళ్ళింత చేసుకుని గుర్రగా చింపిరి జుట్టుతో తమిళ భాషలో దెయ్యం మాట్లాడే మాటలే గుర్తుకొస్తాయి. ఆ పాత్ర చేసిన జ్యోతిక అలా ముద్రపడిపోయింది చాలామందికి. ఈ సినిమాలోని ‘చంద్రముఖి’ క్యారెక్టర్‌లో ఎందరో కనిపించినా కూడా జ్యోతిక నటన ముందు అనుష్క లాంటి వారు కూడా తేలిపోయారు. అలాంటి సినిమాకు సీక్వెల్ రాబోతుందని.. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ నటించబోతున్నారనే వార్త తెలిసినప్పటి నుంచి.. ఏదో రకంగా ఈ సినిమా వార్తలలో నిలుస్తూనే ఉంది.

‘చంద్రముఖి 2’లో రజనీ పాత్రను రాఘవ లారెన్స్ చేయడం గురించి కంటే, చంద్రముఖి పాత్ర చేసిన జ్యోతిక స్థానంలో కంగనా కనిపించబోతుందనే వార్త బాగా వైరల్ అవుతూ వచ్చింది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదలకు సిద్ధం కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ కూడా ఇప్పటికే మొదలయ్యాయి.

తాజాగా చెన్నైలో ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఓ స్టూడెంట్‌పై లారెన్స్ బౌన్సర్ చేయి చేసుకున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలిసిన రాఘవ లారెన్స్ వెంటనే సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ విషయంపై స్పందించడమే కాకుండా లారెన్స్ తన బౌన్సర్లపై మండి పడ్డాడు. అలాగే దాడికి గురైన వ్యక్తికి ఆయన క్షమాపణలు కూడా తెలియజేశాడు.

‘‘దాడి జరిగినట్టుగా నాకు తెలియదు. అలాగే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంస్థకు కూడా తెలియదు. మామూలుగానే నాకు గొడవలు నచ్చవు. ఫంక్షన్ అయిపోయాక ఈ గొడవ సంగతి తెలిసింది. స్టూడెంట్స్ అంటే నాకు ఎంతో ఇష్టం.. వాళ్లు ప్రయోజకులై జీవితంలో పైకి ఎదగాలని ఎప్పుడూ కోరుకుంటాను.

అలాంటి వారిపై గొడవలు, కొట్లాటలు అనేవి నేను సహించని విషయాలు. ముఖ్యంగా ఓ వ్యక్తిని కొట్టడం అనేది చాలా తప్పు. ఇలా జరిగి ఉండకూడదు. దీనికి నేను క్షమాపణలు చెబుతున్నాను. ఇకపై ఇలాంటివి జరగవని మాట కూడా ఇస్తున్నాను. నా బౌన్సర్లకు ఇదే నా విజ్ఞప్తి’’ రాఘవ లారెన్స్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Latest News