Site icon vidhaatha

చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు.. ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

విధాత, నల్గొండ జిల్లా నార్కట్ పల్లి చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామ లింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్థానిక నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ జెడ్పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.

గుట్ట పైన జరిగిన బ్రహ్మోత్సవ ప్రారంభ పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థము జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేపట్టిందన్నారు.

మహిమాన్వితమైన చెరువుగట్టు శైవ క్షేత్రం అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన తోడ్పాటు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అపూర్వరావు, దేవాలయం పాలకమండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version