Site icon vidhaatha

నకిరేకల్‌లో హోలీ టెన్షన్! చిరుమర్తి VS వేముల వర్గీయుల హొలీ పోరు!

NAKIREKAL, MLA, CHIRUMARTHI VS VEMULA

విధాత: నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో హోలీ సంబరాలు అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశము వర్గీయుల మధ్య పోటాపోటీగా సాగింది. అటు చిరుమర్తి ఇటు వేముల ఇద్దరూ కూడా తమ వెంట వందలాది మంది అనుచరులతో హోలీ సంబరాలు సాగిస్తూ ప్రదర్శనగా నకిరేకల్ సెంటర్‌కు చేరుకున్నారు.

ఇరువర్గాలు ఎదురెదురు పడగా పోటాపోటీ నినాదాలతో రెండు వర్గాల కార్యకర్తలు హోరెత్తించారు. అయితే పోలీసులు చిరుమర్తి వర్గీయులకు డీజే పర్మిషన్ ఇచ్చి తమకు ఇవ్వకపోవడం పట్ల వేముల వీరేశం వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు.

ఈ సందర్భంగా వేముల, చిరుమర్తి వర్గీయుల పోటాపోటీ నినాదాలతో నకిరేకల్ సెంటర్ దద్దరిల్లిపోయింది. ఒక దశలో రెండు వర్గాల కార్యకర్తల మధ్య వాగ్వివాదం, తోపులాట సైతం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు పరిస్థితి అదుపు తప్పకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు.

Exit mobile version