China Defense Budget l ర‌క్ష‌ణ బ‌డ్జెట్‌ను భారీగా పెంచిన చైనా.. 225బిలియ‌న్ డాలర్లు కేటాయింపు

<p>క‌ల‌కం సృష్టిస్తున్న నిధుల కేటాయింపు.. కోవిడ్‌.. ఎవ‌రి ద‌గ్గ‌ర స‌మాచారం ఉన్నా వెల్ల‌డించాల‌ని కోరిన WHO చైనా అమెరికా మ‌ధ్య మాట‌ల యుద్ధం ప‌రోక్షంగా ర‌ష్యాను స‌మ‌ర్థిస్తున్న చైనా చైనానే నిందిస్తున్న నాటో దేశాలు త‌ట‌స్థ వైఖ‌రిని అవ‌లంబిస్తున్న భార‌త్‌ China has increased its defense budget విధాత‌: సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చైనా ప్రభుత్వం దేశ రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచింది. ఈ ఏడాది రక్షణ బడ్జెట్‌ను 225 బిలియన్‌ డాలర్లు కేటాయించింది. […]</p>

China has increased its defense budget
విధాత‌: సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చైనా ప్రభుత్వం దేశ రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచింది. ఈ ఏడాది రక్షణ బడ్జెట్‌ను 225 బిలియన్‌ డాలర్లు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే 7.2 శాతం పెంచింది. విదేశీ ముప్పును ఎదుర్కోవడానికి డ్రాగన్‌ దేశం రక్షణ నిధులను భారీగా పెంచింది.
కరోనా వైరస్‌ (Covid-19) చైనా ప్రయోగశాల (Chinese lab leak) నుంచే ఆవిర్భవించిందని మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్న అమెరికా ఇటీవల మరో నివేదిక ఇచ్చింది. దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) కొవిడ్‌ మూలాల గురించి ఏ దేశం వద్ద సమాచారం ఉంటే దానిని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ సైన్స్‌ సంస్థలకు వెల్లడించాలని, ఇది అత్యావశ్యం అని పేర్కొన్నది.

క‌రోనా మూలం గుర్తింపులో ఏ అవ‌కాశాన్ని వ‌దిలేయం: WHO

ఇది సేకరించడానికి ఏ ఒక్కరినో నిందించడానికి కాదని, భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ముందస్తుగా ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగానే సమాచారాన్ని కోరుతున్నామన్నది. కరోనా మూలాన్ని గుర్తించడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదిలేయమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెట్రోస్‌ (WHO Director-General Dr Tedros) చెప్పారు.

చైనా వైపే వేలెత్తి చూపుతున్న నాటో దేశాలు

కొవిడ్‌ విషయంలో అమెరికా, చైనాల మధ్య మాటల‌ యుద్ధం జరుగుతున్నది. నాటో దేశాలు కూడా ఈ విషయంలో చైనా వైపే వేలెత్తి చూపుతున్నాయి. మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్‌ తటస్థ వైఖరిని అవలంబిస్తుండగా.. చైనా పరోక్షంగా రష్యాను సమర్థిస్తుండటం అగ్రరాజ్యానికి మింగుడు పడటం లేదు. వీటన్నింటి నేపథ్యంలో చైనా తన రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచడం కలకలం సృష్టిస్తున్నది.