Aiswarya Deepam | ప్రతి ఇంటి యజమాని లేదా యజమానురాలు తమ ఇంట సిరిసంపదలు వెల్లివెరియాలని కోరుకుంటారు. అందుకోసం నిత్యం సంపదకు సూచికగా భావించే లక్ష్మీదేవి( Lakshmi Devi )ని పూజిస్తుంటారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల కొంతైన ఆర్థిక కష్టాలు(Financial Problems ) తీరుతాయని నమ్మకం. మరి ఆర్థిక సమస్యలు అధికంగా ఉండి, అప్పుల( Debts ) ఊబిలో కూరుకుపోయిన వారు కాస్త ఊపిరి పీల్చుకోవాలనుకుంటే ఈ చిన్న నియమం పాటిస్తే సరిపోతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ప్రతి శుక్రవారం సాయంత్రం వేళ ఉప్పుతో ఐశ్వర్య దీపం( Aiswarya Deepam )వెలిగిస్తే.. ఆర్థిక సమస్యలన్నీ మటుమాయం అవుతాయని, తదనంతరం కోటీశ్వరులై పోవచ్చు అని పండితులు పేర్కొంటున్నారు. మరి ఉప్పుతో ఐశ్వర్య దీపం వెలిగించడం ఎలా..? ఎన్ని వారాలు వెలిగించాలి అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఐశ్వర్య దీపం ఎప్పుడు వెలిగించాలి..?
ఆర్థిక సమస్యలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు.. ప్రతి శుక్రవారం సాయంత్రం ఐశ్వర్య దీపం వెలిగించాలి. శుక్రవారం సాయంత్రం వేళ రెండు ప్రమిదలు తీసుకొని దానికి పసుపు కుంకుమ రాయాలి. భూశుద్ధి చేసి బియ్యం పిండి పసుపు కుంకుమలతో ముగ్గు వేయాలి. ఆ ముగ్గులో రెండు ప్రమిదలను ఒకదానిపై ఒకటి పెట్టాలి. అందులో పావు కిలో వరకు రాళ్ల ఉప్పు ఉంచాలి. అనంతరం ఆ ఉప్పుపై పసుపు కుంకుమ చల్లాలి. పూలతో అలంకరించాలి. ఇప్పుడు ఈ చిన్న ప్రమిదల్లో ఆవు నెయ్యి నిండుగా పోసి అందులో రెండు వత్తులు వేసి రెండింటిని ఒకటిగా చేసి అగరుబత్తితో దీపాన్ని వెలిగించాలి.
దీపం వెలిగించే సమయంలో ఈ శ్లోకం పఠించాల్సిందే..
ఐశ్వర్య దీపం వెలిగించేటప్పుడు ‘దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్ధన దీపో హరతుమే పాపం సంధ్యా దీపం నమోస్తుతే’ అనే శ్లోకం చదువుకోవాలి. అనంతరం ఈ ఐశ్వర్య దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పరమాన్నం కానీ, పాలు పళ్లు కానీ, పటికబెల్లం, కొబ్బరికాయ ఏదైనా శక్తికొద్దీ నైవేద్యంగా పెట్టి , లక్ష్మీ, వేంకటేశ్వరస్వామి స్త్రోత్రం చదువుకోవాలి. అష్టలక్ష్మి స్తోత్రం, కనకధార స్తోత్రం కూడా చదువుకుంటే మంచిది.
ఏ దిశలో దీపాన్ని వెలిగించాలి..?
వేగవంతమైన కచ్చితమైన ఫలితాలు కోసం ఐశ్వర్య దీపాన్ని ఇంటికి ఈశాన్యం మూల పెట్టడం శుభప్రదం. ఇక దీపారాధన అనంతరం ఉప్పును మరుసటి రోజు అంటే శనివారం నాడు నదిలో కలపాలి. లేదా కొబ్బరి చెట్టు మొదట్లో వేసి కరిగేలా నీళ్లు పోయాలి. ఈ రెండు వీలుకాని పక్షంలో ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ ఉప్పును చల్లాలి.
ఐశ్వర్య దీపం ఎన్ని వారాలు వెలిగించాలి?
తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు 11 లేదా 16 శుక్రవారాలు ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం వల్ల సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. 41 శుక్రవారాలు ఈ ఉప్పు దీపం పెట్టే వారికి శాశ్వతంగా ధనానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. ముఖ్యంగా పౌర్ణమి శుక్రవారం కలిసి వచ్చిన రోజు ఈ ఐశ్వర్య దీపం వెలిగిస్తే జీవితంలో అసలు ధనానికి లోటుండదని శాస్త్రవచనం.
