Site icon vidhaatha

Woman Journalist | మీరు వేశ్య క‌దా.. అందుకే వ‌చ్చాం.. మ‌హిళా జ‌ర్న‌లిస్టుకు వేధింపులు

Woman Journalist |

విధాత: చైనాకు చెందిన సూ యుటాంగ్ వృత్తి రీత్యా జ‌ర్న‌లిస్టు. యుటాంగ్ ప్ర‌స్తుతం జ‌ర్మ‌నీలో ఉంటున్నారు. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి సూ యుటాంగ్ ఇంటికి మ‌గాళ్లు వ‌స్తున్నారు. వారిని మీరు ఎవ‌ర‌ని అడ‌గ్గా.. మీరు వేశ్య క‌దా.. ఆన్‌లైన్‌లో ప్ర‌క‌ట‌న ఉంది.. అందుకే వ‌చ్చాం అని చెబుతున్నార‌ట‌. దాంతో ఆ మ‌హిళ జ‌ర్న‌లిస్టు షాక్‌కు గురైంద‌ట‌.

అందుకే ఆమె టార్గెట్ అయ్యారు..

1989లో బీజింగ్‌లోని తియాన్మిన్ స్క్వేర్‌లో విద్యార్థులు పెద్ద ఎత్తున చేప‌ట్టిన ఆందోళ‌న‌ల‌ను చైనా ప్ర‌భుత్వం క్రూరంగా అణిచివేసింది. అయితే ఈ అణిచివేత‌ను నిర‌సిస్తూ ప్ర‌జాస్వామిక‌వాదులు అప్పుడప్పుడు ప్ర‌పంచంలోని ప‌లు చోట్ల ర్యాలీలు, నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హిస్తుంటారు.

జ‌ర్న‌లిస్టు సూ యుటాంగ్ కూడా జ‌ర్మ‌నీలో నిర్వ‌హించిన ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ఆమె చైనా ఏజెంట్ల‌కు టార్గెట్ అయ్యారు. ఆ మ‌హిళా జ‌ర్న‌లిస్టు వ్యక్తిత్వాన్ని దెబ్బ‌తీసే విధంగా చైనా ఏంజెట్లు ప్ర‌ణాళిక‌లు రూపొందించారు.

ఇక ఆమెను వేశ్య‌గా చిత్రీక‌రించి ఆన్‌లైన్‌లో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు చైనా ఏంజెట్లు. జ‌ర్న‌లిస్టు ఫోన్ నంబ‌ర్, అడ్ర‌స్‌ను ఆన్‌లైన్‌లో ఉంచ‌డంతో.. ఆమె ఇంటికి మ‌గాళ్లు వెళ్ల‌డం ప్రారంభ‌మైంది. అంతేకాకుండా అస‌భ్య‌క‌ర‌మైన ఫోటోల‌తో ఆమెకు మేసేజ్‌లు పంపుతున్నారు.

ఈ వేధింపులు భ‌రించ‌లేక‌.. ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అయితే చైనా అస‌మ్మ‌తివాదులు ప్ర‌పంచంలో ఎక్క‌డ ఉన్నా ఇలాంటి వేధింపుల‌కు టార్గెట్‌గా మారుతున్న‌ట్టు మీడియా వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Exit mobile version