Kanpur
- తీవ్రగాయాలు.. యూపీలోని ప్రైవేటు స్కూల్‌లో ఘటన
విధాత: యవకులు, విద్యార్థులు సినిమా హీరోలను అనుకరించడం సాధారణమే. కానీ ఓ స్కూల్ విద్యార్థి సినిమా హీరోలా స్టంట్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన 3వ తరగతి విద్యార్థి సినిమా సన్నివేశంలో స్టంట్‌ను అనుకరిస్తూ తన పాఠశాల మొదటి అంతస్తు నుంచి దూకాడు. సూపర్ హీరో హృతిక్‌రోషన్ చిత్రం క్రిష్ సినిమా నుంచి ఆ బాలుడు స్ఫూర్తి పొందినట్టు సమాచారం.
Sensitive visual
Class IIIrd student imitating ‘SuperHero’ injured himself seriously after jumping from 1st floor of school building in Kidwai Nagar of #Kanpur #UttarPradesh #Parenting #School pic.twitter.com/mrv4PLhtbu
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) July 21, 2023
కిద్వాయ్ నగర్ వీరేంద్ర స్వరూప్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో చదువుతున్న బాలుడు క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. మొదటి అంతస్థులో గ్రిల్స్ ఎక్కి ఒక్కసారిగా దూకేశాడు. బాలుడి ముఖానికి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
అతడిని వెంటనే ప్రైవేటు దవాఖానకు తరలించారు. విద్యార్థి కాన్పూర్‌లోని బాబు పూర్వ పరిసర ప్రాంతంలోని అనిల్ కాలనీకి చెందినవాడు. పాఠశాల సమయంలో అతను మొదటి అంతస్తు రెయిలింగ్ నుంచి దూకిన ఘటనలో అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.