Site icon vidhaatha

CM Jagan  | సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో సతీష్ అరెస్ట్

విధాత : సీఎం జగన్ పై రాయిదాడి హత్యాయత్నం కేసులో నిందితుడు సతీష్ అరెస్ట్ చేసిన అజిత్‌హింగ్‌ నగర్‌ పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. హత్యయత్నం కేసులో ఏ 1 గా సతీష్ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం సతీశ్‌ను కోర్టులో హాజరుపర్చారు. సీఎంపై రాయి విసిరింది అతనేనని పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు సింగనగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్‍తో పాటు అతనితో ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్‍లతో సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారించారు. దుర్గారావు ఏ2గా ఉన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్‌పై రాయిదాడి జరగడంతో జగన్‌ కంటిపై భాగంలో గాయమైంది. ఈ దాడి ఘటన ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో రాజకీయంగా వివాదస్పమైంది.

ఇక రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. న్యాయవాది కమిషనర్‌ను నియమించాలని న్యాయవాది పిటిషన్‌లో అభ్యర్థించారు. వైసీపీ నేతలు, పోలీసులు ఈ కేసులో ఇంకెవరిని ఇరికిస్తారో అనే భయంతో కాలనీ వాసులు కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని, రెండు, మూడు వీధులు జన సంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయాయని, ఈ నేపథ్యంలో పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Exit mobile version