విధాత: మునుగోడు ఉప ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో గెలువబోతున్నట్టు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు. నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లక్షా పదివేల ఓట్లు తనకు రానున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై దాడికి యత్నించారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశమంతా అవినీతిమయం అయిపోయిందని, సీబీఐ, ఈడీ, ఐటీలను బీజేపీ వాళ్లు వాడుతున్నారు.. కేసీఆర్ ఏసీబీ, పోలీస్ వ్యవస్థను, ప్రభుత్వ సిబ్బందిని సొంత బంట్రోతుల్లాగా వాడుతున్న సంగతి తనకు తెలుసు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. అందుకే మునుగోడు ప్రజలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించబోతున్నారన్నారు.
కేసీఆర్ నిన్న మీడియా సమావేశంలో ఓటములు గెలుపు ఖాయమని నాలుగు సార్లు అన్నారు. కేసీఆర్ మాటల్లో కూసుకుంట్ల ఓటమి ఖాయమైపోయిందన్నారు. ఫలితాల రోజు తనకు కంగ్రాట్స్ చెప్పినా ఆశ్యర్యపోవాల్సిందేమీ లేదన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, బిలియనీర్లను చేద్దాం, ప్రెసిడెంట్లను తీసుకొద్దాం. లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేద్దామంటే ఒక్కసారి కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ ఎందుకు పలకలేదని ఆయన ప్రశ్నించారు. మునుగోడు చూసిన తర్వాత అసలు అభివృద్ధి లేకుండా ఉన్న ఇలాంటి ప్రాంతాన్ని ప్రపంచంలో తానెక్కడా చూడలేదన్నారు.
కొలెస్ట్రాల్.. ప్రపంచంలోనే అతి పెద్ద మెడికల్ స్కామ్: అమెరికా వైద్యులు