CM Nitish Kumar | విధాత: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ప్రమాదం తప్పింది. పాట్నా యూనివర్సిటీకి మంగళవారం నితీశ్ వెళ్లారు. యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు సీఎం నితీశ్ సిద్ధమయ్యారు. ఇంతలోనే సీఎం పట్టు కోల్పోయి కిందపడిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది నితీశ్‌ను పట్టుకుని పైకి లేపారు.
शिक्षक दिवस के कार्यक्रम में लड़खड़ाकर गिरे CM नीतीश कुमार#NitishKumar pic.twitter.com/mpLrwoALmY
— Sritygupta (@sritygupta) September 5, 2023
అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం నితీశ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, క్షేమంగా ఉన్నారని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో బీహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, పాట్నా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గిరీశ్ కుమార్ చౌదరితో పాటు పలువురు ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.