విధాత, హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి(Kaloji Narayana Rao) సందర్భంగా వారి చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సహా కాంగ్రెస్(Congress) ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఢిల్లీలోని(Delhi) రేవంత్ రెడ్డి నివాసంలో వారంతా కాళోజీకి నివాళులు అర్పించారు. కాళోజీకి నివాళులు అర్పించిన అనంతరం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అంతా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు రేణుకా చౌదరి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురామ్ రెడ్డి, అనిల్ యాదవ్, గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, సురేష్ కుమార్ షేట్కార్, బలరాం నాయక్, కడియం కావ్య ప్రభృతులు ఉన్నారు.