విధాత : క్రికెట్ అభిమానులకు నేటి నుంచి అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ రూపంలో మరో మెగా టోర్నీ వినోదాన్ని పంచబోతుంది. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ తొలి మ్యాచ్ గురువారం గ్రూప్ బీ నుంచి భారత్-అమెరికా మ్యాచ్ తో ప్రారంభమవుతుంది.బులవాయో వేదికగా జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది. ఇదే రోజు గ్రూప్-సిలో స్కాట్లాండ్‌ను జింబాబ్వే, గ్రూప్-డిలో టాంజానియాను వెస్టిండీస్ ఢీకొంటాయి. 23 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్ లు జరగనున్నాయి.
జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న ఈ ప్రపంచకప్‌లో 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. అక్కడి నుంచి ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
గ్రూప్-ఎ: ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక
గ్రూప్-బి: భారత్, అమెరికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్
గ్రూప్-సి: ఇంగ్లాండ్, పాకిస్థాన్, స్కాట్లాండ్, జింబాబ్వే
గ్రూప్-డి: అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా, టాంజానియా, వెస్టిండీస్
ఫెవరేట్ గా యువ భారత్
భారత్ యువ జట్టు ఈ టోర్నీలో ఫెవరెట్ గా బరిలోది దిగుతుంది. ఇప్పటి వరకూ ఐదుసార్లు యువ భారత్ అండర్ -19 వరల్డ్ కప్ క్రికెట్ టైటిల్ గెలిచింది. భారత జట్టు 2000, 2008, 2012, 2022, 2018లో టైటిళ్లు గెలుచుకుంది. 2024లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయంపాలైంది.
అండర్-19 వరల్డ్ కప్ లో తలపడుతున్న టీమిండియాకు ఆయుశ్ మాత్రే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో యువ సంచలనం 14 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనున్నాడు.
భారత్ అండర్-19 జట్టు: ఆయుష్ మాత్రే (కెప్టెన్), అంబ్రిశ్, కనిష్క్ చౌహాన్, దీపేశ్, మహ్మద్ ఎనాన్, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు, కిషన్ కుమార్ సింగ్, విహాన్ మల్హోత్రా, ఉద్ధవ్ మోహన్, హెనిల్ పటేల్, ఖిలాన్, హర్వంశ్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది.
