Site icon vidhaatha

Congress | ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ‘కాంగ్రెస్‌’ అబ్జర్వర్ల నియామకం

Congress |

విధాత: ఈ ఏడాదిలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కాంగ్రెస్‌ పార్టీ అబ్జర్వర్లను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ తరపున ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సోమవారం ఎన్నికల పరిశీలకుల జాబితాను ప్రకటించారు. మిజోరం మినహా మిగిలిన రాష్ట్రాలకు ఒక సీనియర్‌ అబ్జర్వర్‌, అబ్జర్వర్లను నియమించింది.

తెలంగాణకు సీనియర్‌ అబ్జర్వర్‌గా దీప్‌దాస్‌మున్షి, అబ్జర్వర్‌గా సిరివెల్ల ప్రసాద్‌, రాజస్థాన్‌కు మధుసూధన్‌ మిస్త్రి, శశికాంత్‌ సెంథిల్‌, మధ్య ప్రదేశ్‌కు రన్‌దీప్‌ సింగ్‌ సృజేవాలా, చంద్రకాంత్‌హ్యాండోర్‌, చత్తీస్‌గడ్‌కు ప్రీతం సింగ్‌, మీనాక్షి నటరాజన్‌, మిజోరంకు సచిన్‌రావులను నియమించారు.

Exit mobile version