చైనాలో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌ణ‌.. ఒక్క‌రోజే 40 వేల కేసులు

Coronavirus | చైనాలో మ‌ళ్లీ క‌రోనా విజృంభించింది. గ‌త కొద్ది రోజుల నుంచి వేల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. శ‌నివారం ఒక్క‌రోజే దాదాపు 40 వేల కేసులు న‌మోదైన‌ట్లు చైనా జాతీయ ఆరోగ్య క‌మిష‌న్ ప్ర‌క‌టించింది. ఇందులో 3,709 కేసులు ల‌క్ష‌ణాల‌తో కూడి ఉన్నాయ‌ని, 36,082 కేసుల్లో ల‌క్ష‌ణాలు క‌నిపించ‌ లేద‌న్నారు. శుక్ర‌వారం రోజు 35,183 కేసులు న‌మోదు అయ్యాయ‌ని గుర్తు చేసింది. క‌రోనాతో ఒక‌రు మృతి చెందిన‌ట్లు తెలిపారు. న‌వంబ‌ర్ 26 నాటికి […]

  • Publish Date - November 27, 2022 / 02:26 AM IST

Coronavirus | చైనాలో మ‌ళ్లీ క‌రోనా విజృంభించింది. గ‌త కొద్ది రోజుల నుంచి వేల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. శ‌నివారం ఒక్క‌రోజే దాదాపు 40 వేల కేసులు న‌మోదైన‌ట్లు చైనా జాతీయ ఆరోగ్య క‌మిష‌న్ ప్ర‌క‌టించింది.

ఇందులో 3,709 కేసులు ల‌క్ష‌ణాల‌తో కూడి ఉన్నాయ‌ని, 36,082 కేసుల్లో ల‌క్ష‌ణాలు క‌నిపించ‌ లేద‌న్నారు. శుక్ర‌వారం రోజు 35,183 కేసులు న‌మోదు అయ్యాయ‌ని గుర్తు చేసింది. క‌రోనాతో ఒక‌రు మృతి చెందిన‌ట్లు తెలిపారు. న‌వంబ‌ర్ 26 నాటికి చైనాలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,802కు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో షాంఘైలో అత్య‌ధికంగా పాజిటివ్ కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.

చైనాలో పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్న నేప‌థ్యంలో కొవిడ్ ఆంక్ష‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. జీరో కోవిడ్ పాల‌సీపై చైనీయులు చిర్రెత్తి పోతున్నారు. క‌ఠిన ఆంక్ష‌ల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జలు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఉరుమ్‌కి ప‌ట్ట‌ణంలో భారీ ఎత్తున ప్ర‌జ‌లు నిరస‌న‌లు నిర్వ‌హించారు.

స్థానికంగా ఓ భ‌వ‌నంలో మంట‌లు చెల‌రేగి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌ఠిన ఆంక్ష‌ల అమ‌ల్లో భాగంగా గేట్ల‌కు తాళాలు వేయ‌డంతో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాలేక ప్రాణాలు కోల్పోయాన‌ని చైనీయులు పేర్కొన్నారు. కోవిడ్ లాక్‌డౌన్‌ను అంతం చేయాల‌ని నినాదాలు చేశారు.

Latest News