విధాత : అణు కార్యక్రమాల నిలుపుదలపై ఇరాన్ ను లొంగదీసుకునే నేపథ్యంలో ఆ దేశం చుట్టు అమెరికా భారీగా సైన్యాన్ని మోహరించిన సంగతి తెలిసిందే. జెనివా కేంద్రంగా ఇరాన్ తో ఓమన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న చర్చలు సంతృప్తికరంగా లేవని, నా మాటలను ఇరాన్ పట్టించుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన కొద్ధి సేపటికే ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాలు ఉమ్మడి సైనిక దాడులకు దిగాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులతో దద్దరిల్లింది. ఇరాన్ అధ్యక్షుడు ఖమోని రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు. షీల్డ్ ఆఫ్ యూత్ పేరుతో జాయింట్ సైనిక ఆపరేషన్ కు దిగిన అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ లోని 30ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నాయి.
తాజాగా టెహ్రాన్ పై దాడులకు పాల్పడింది తామేనని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఇరాన్ తో తమకు ముప్పు ఉందన్న ఆందోళనతో తామే ముందుగా దాడికి పాల్పడినట్లుగా ఇజ్రాయెల్ పేర్కొంది. గత ఎడాది జూన్ లో 12 రోజులపాటు ఇజ్రాయిల్ , ఇరాన్ ల మధ్య యుద్ధం కొనసాగింది. చివరకు అమెరికా చొరవతో జూన్ 24న ఇరుదేశాలు యుద్దవిరమణ చేశాయి. మళ్లీ తాజాగా ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. దీంతో ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై ప్రతిదాడులు చేసే పరిస్థితి నెలకొంది. ఇది మధ్యప్రాచ్యాన్ని కొత్త సైనిక ఘర్షణలోకి నెట్టివేసింది. పశ్చిమ దేశాలతో టెహ్రాన్ దీర్ఘకాలంగా కొనసాగుతున్న అణు వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. తాజా దాడుల నేపథ్యంలో పౌర విమానాలకు ఇజ్రాయెల్ తన గగనతలాన్ని మూసివేసి…దేశమంతా సైరన్లు మోగించింది. విద్యా,వ్యాపార సంస్థలను మూసివేసింది. ఇజ్రాయెల్ దేశానికి ముప్పును తొలగించడానికి ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముందస్తు దాడిని ప్రారంభించింది అని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు.
దక్షిణ లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. ఇటీవల చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచుగా హిజ్బుల్లా తీవ్రవాదులు ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులకు దిగింది. దక్షిణ లెబనాన్ లోని టెర్రరిస్టుల మౌలిక సదుపాయాల ధ్యంసమే టార్గెట్‌గా ఈ అటాక్స్ జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్ అనుకూల వర్గాలైన హిజ్బుల్లా, హౌతీలు ఇరాన్‌కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు దిగడంతో ..అటు ఇరాన్ అనుకూల వర్గాలు అమెరికా, ఇజ్రాయెల్ పై దాడులకు సిద్ధమవుతున్నాయి. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి.
పాకిస్తాన్ – అప్ఘానిస్తాన్ ల మధ్య భీకర దాడులు
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తాజాగా యుద్ధరూపం దాల్చాయి. ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఇంకోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Gold Silver Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
CORE Urban Act | జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం…
