Cow And Snake |
విధాత: అరుదైన దృశ్యం ఇది.. ఎవరూ ఊహించని ఘటన ఇది. అసలు ఇది నిజమేనా..? అన్న విధంగా ఆ దృశ్యం ఆవిష్కృతమైంది. బుసలు కొడుతున్న నాగుపాముతో ఓ ఆవు కాసేపు చెలిమి చేసింది. అంతేకాదు.. పాము పడగకు ముద్దు పెట్టింది. నాలుకతో పడగను నాకింది. పాము కూడా ఆవును కాటేయలేదు. ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రకృతిలో ఇది నిజమైన ప్రేమ అని పేర్కొన్నారు. 17 సెకన్ల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోను అప్‌లోడ్ చేసిన 15 గంటల్లోనే 3 లక్షల మంది వీక్షించారు. 5 వేల మంది లైక్ చేశారు.
Russia | రష్యాలో దారుణం.. యువతిని మంచానికి కట్టేసి 1000 సార్లు లైంగికదాడి
ఇక కొందరు నెటిజర్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ప్రకృతిని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు అని ఓ యూజర్ పేర్కొన్నాడు. ఆ స్నేహబంధం అద్భుతమని మరో యూజర్ రాసుకొచ్చాడు.
కొందరు మాత్రం ఆ వీడియోను ఎంత వరకు నమ్మవచ్చు అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఏడాది ఎన్నో పశువులు పాము కాటుతో చనిపోతుంటాయని, ఇది ఎడిటింగ్ చేసిన వీడియో అని, నమ్మశక్యంగా లేదని ఓ యూజర్ అన్నాడు.