Site icon vidhaatha

CPM | తెలంగాణలో.. 15-20స్థానాల్లో పోటీకి మేం సిద్ధం: బీ.వి.రాఘవులు

CPM |

విధాత, తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 15-20స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీ.వి.రాఘవులు వెల్లడించారు. ఆదివారం దోమలగూడ యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని, అందుకు వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు.

ఇందుకు తమ పార్టీ చేసే పోరాటాలకు బీఆరెస్ మద్దతునిస్తే ఆ పార్టీ కలిసి పనిచేస్తామన్నారు. బీఆరెస్‌, సీపీఎంల మధ్య ఇంకా పొత్తులు, సీట్ల కేటాయింపులపై చర్చలు జరుగలేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాతా సీఎం కేసీఆర్‌కు, తమకు మధ్య గ్యాప్ పెరిగిందంటు వస్తున్న వార్తలు అవాస్తమన్నారు.

తాము అపాయింట్‌మెంట్ కోసమో, అధికారం కోసమో పని చేయబోమన్నారు. ప్రజా ప్రయోజనాలే కమ్యూనిస్టుల ప్రాధాన్యత అని అన్నారు. మణిపూర్ హింసాకాండను అదుపు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ తెర పైకి తీసుకు వస్తుందన్నారు.

Exit mobile version