CS Shanti Kumari | విధాత, గోల్కొండ కోటలో మంగళవారం నిర్వహించనున్న దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సోమవారం సమీక్షించారు. కోటను సందర్శించిన శాంతికుమారి వేడుకలకు హాజరయ్యే ప్రముఖులకు, ప్రజలకు అవసరమైన సీటింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, మంచినీరు, పారిశుద్యం, వైద్య వసతుల కల్పన, బందోబస్తు చర్యల ఏర్పాట్ల వివరాలను సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు, ఆర్‌అండ్‌బీ సెక్రటరీ శ్రీనివాసరాజు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ బోర్డు ఎండీ ధనికిషోర్, ఐఆండ్‌పీఆర్ కమిషనర్ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.