Site icon vidhaatha

Horoscope | ఈ రోజు రాశి ఫ‌లాలు(12-07-2023).. ఈ రాశివారికి శత్రువుల బెడ‌ద‌..!

Horoscope |

మేషం : ఈ రాశి వారు శుభ‌వార్త వింటారు. బంధు, మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

వృషభం : ఈ రాశి వారు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. అన‌వ‌స‌ర‌మైన విష‌యాల్లో త‌ల దూర్చొద్దు. ఆటంకాలు ఎదుర‌వుతాయి.. అయిన‌ప్ప‌టికీ అధిగ‌మిస్తారు. మీ డ‌బ్బు మీ చేతికి అందుతుంది.

మిథునం : ఈ రాశివారికి ఇవాళ శుభ‌కాలం. ముఖ్య‌మైన ప‌నులు ప్రారంభిస్తారు. మీ రంగాల్లో అనుకూల ఫ‌లితాలు ఉంటాయి. మానసిక సంతృప్తి కలుగుతుంది.

క‌ర్కాట‌కం : ఈ రాశివారు స‌హ‌నం కోల్పోకుండా ఉండాలి. అన్నీ స‌ర్దుకుంటాయి. ఇత‌రుల‌చే మాట ప‌డాల్సి వ‌స్తుంది. ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి.

సింహం : కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. ఆర్థికంగా నిల‌దొక్కుకుంటారు. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాది రంగాల్లో మంచి ఫ‌లితాలు ఉన్నాయి.

క‌న్య : ఆత్మీయుల స‌హ‌కారం ల‌భిస్తుంది. శ‌త్రువుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. కొనుగోళ్లు చేస్తారు. ప‌నుల్లో శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి.

తుల : ఈ రాశివారు శుభ‌వార్త వింటారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు.

వృశ్చికం : మీ ప్ర‌తిభ‌, ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. ప్రారంభించిన ప‌నుల్లో ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు. భ‌విష్య‌త్‌కు సంబంధించిన కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు.

ధ‌నుస్సు : ఈ రాశివారికి మ‌నోధైర్యం చాలా అవ‌స‌రం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించేందుకు య‌త్నిస్తారు. ఉత్సాహంగా ముందుకు సాగాలి. కీర్తి పెరుగుతుంది.

మ‌క‌రం : ఈ రాశి వారికి రుణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కీల‌క అంశాల్లో పెద్ద‌ల‌న సంప్ర‌దిస్తే మంచిది. దూర‌దృష్టితో ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటారు.

కుంభం : ఈ రాశివారికి మిశ్ర‌మ వాతావ‌ర‌ణం ఉంటుంది. చంచ‌ల‌బుద్ధి ఉంటుంది. త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంది. ఇబ్బందుల పాల‌వుతారు.

మీనం : ఈ రాశివారు శుభ‌ఫ‌లితాల‌ను అందుకుంటారు. ఆనందంగా ఉంటారు. బంధు, మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

Exit mobile version