Site icon vidhaatha

Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ప్ర‌యాణాలు వాయిదా వేస్తే మంచిది..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు ఆనందోత్సాహాలతో సాగిపోతుంది. ప్రారంభించిన పనులు ఎలాంటి ఆటంకం లేకుండా సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికలాభాలు ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఓ శుభవార్త ఆనందం కలిగిస్తుంది. కుటుంబ వాతావరణం ఆనందభరితంగా ఉంటుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆర్ధిక సమస్యలు అశాంతి కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. గిట్టనివాళ్ళు తప్పుదోవ పట్టించే ప్రమాదముంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. తలపెట్టిన పనులలో విజయం సిద్ధిస్తుంది. ఒక సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్నేహితుల ద్వారా ఆర్ధికలబ్ది పొందుతారు. వ్యాపారంలో ఆర్థికలాభాలు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వ్యక్తిగత, వృత్తి పరమైన వ్యవహారాలలో కీలక మలుపు చోటు చేసుకుంటుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. మొహమాటానికి పోయి చిక్కుల్లో పడే ప్రమాదముంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. పట్టుదలతో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. మనోబలంతో ఆటంకాలు అధిగమిస్తారు. ఆర్ధికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరం గొడవలు, వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో తరచూ ఆటంకాలు చికాకు పెడతాయి. చెడు తలపులు, ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. వివాదాలు ఏర్పడకుండా చూసేందుకు కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆకస్మిక ధనలాభాలు అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో ముందుకుసాగి సత్ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో మంచి సమయం గడపడం సంతృప్తినిస్తుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అనుకూలంగా ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారే ప్రమాదముంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఆరోగ్యం క్రమేపీ క్షీణించే అవకాశం వుంది. సహనంతో ఉంటే మంచిది. ఆర్ధిక పరిస్థితి నిరాశకు కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. లక్ష్య సాధన కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోండి. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. ఓ సంఘటన మానసికంగా చికాకు కలిగిస్తుంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో సత్ఫలితాలు రాబట్టుతారు. కొత్త అసైన్ మెంట్స్ మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యులతో ఆచి తూచి నడుచుకోవాలి. వాదనలకు, కలహాలకు దూరంగా ఉంటే మంచిది. బంధువుల ప్రవర్తన విచారం కలిగించవచ్చు. లక్ష్య సాధన కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ధనలాభాలు ఉంటాయి. ప్రయాణం వాయిదా వెయ్యండి.

Exit mobile version