BRS| మీ.. ఎమ్మెల్యే నుంచి కాపాడండి.. CM KCRకు BRS నేత దామోదర్‌రెడ్డి వినతి

కోట్ల విలువ చేసే భూమి కబ్జా చేశాడ‌ని ఆరోప‌ణ‌ న‌మ్మించి మోసం చేశాడ‌ని ఆవేద‌న‌ విధాత: ఆర్మూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఏ.జీవన్ రెడ్డి తనను నిండా మోసం చేశాడని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు న్యాయం చేయాలని బిఆర్ఎస్ నాయకుడు సామ దామోదర్ రెడ్డి వేడుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో 172 ఎకరాల్లో లే అవుట్ వేసి అభివృద్ధి చేశానని దామోదర్ రెడ్డి వెల్లడించారు. ఈ భూమిలో ప్లాట్లు చేసి, రిసార్టులు కూడా […]

  • Publish Date - April 16, 2023 / 02:44 PM IST

  • కోట్ల విలువ చేసే భూమి కబ్జా చేశాడ‌ని ఆరోప‌ణ‌
  • న‌మ్మించి మోసం చేశాడ‌ని ఆవేద‌న‌

విధాత: ఆర్మూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఏ.జీవన్ రెడ్డి తనను నిండా మోసం చేశాడని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు న్యాయం చేయాలని బిఆర్ఎస్ నాయకుడు సామ దామోదర్ రెడ్డి వేడుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో 172 ఎకరాల్లో లే అవుట్ వేసి అభివృద్ధి చేశానని దామోదర్ రెడ్డి వెల్లడించారు.

ఈ భూమిలో ప్లాట్లు చేసి, రిసార్టులు కూడా నిర్మాణం చేశాను. రిసార్టుల ద్వారా అనుకున్నంతగా లాభాలు రాలేదు. ఈ మధ్యలోనే ఎమ్మెల్యే ఏ.జీవన్ రెడ్డి కలిసి, ఇద్దరం కలిసి లే అవుట్‌ను విక్రయిద్దామని చెప్పాడు. ఇద్దరి అంగీకారంతో మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయు) కూడా రాసుకోవడం జరిగిందన్నారు.

రూ.15.30 కోట్ల విల్లా ఇస్తానన్నాడు, మూడు వేల చదరపు గజాల స్థలం, రూ.22 కోట్ల విలువ చేసే కమర్షియల్ ప్రాపర్టీ, 22వేల చదరపు అడుగల డెవలప్ మెంట్ స్థలం ఇస్తానన్నాడు. 94 ఎకరాలకు రూ.23.50 కోట్లు విలువ సరిపోయిందన్నారు.

రిసార్ట్ లో కూడా భాగస్వామ్యం ఇవ్వాలని కోరగా ఇవ్వడం జరిగిందన్నారు. రెండింతల లాభం వస్తుందని చెప్పగా నమ్మామని ఆయన వివరించారు. జీవన్ రెడ్డిని నమ్మిన పాపానికి డబ్బులు ఇవ్వకుండా అన్ని కబ్జా చేసుకున్నాడని దామోదర్ రెడ్డి వాపోయాడు.

లేఅవుట్ లో ఫంక్షన్ హాలు, రెండు గుడులను కూడా మూసివేసి, తనను వెళ్లకుండా బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. 2013 నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ రంగారెడ్డి జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా పనిచేశానని, కేసీఆర్ తనకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు సామ దామోదర్ రెడ్డి వేడుకున్నారు.

Latest News