Dehradun | మూడు రోజులు.. త‌ల్లిదండ్రుల‌ మృత‌దేహాల మ‌ధ్య‌లో ఆరు రోజుల శిశువు

Dehradun డెహ్రాడూన్: ఓ ఇంటి నుంచి దుర్వాస‌న వ‌స్తోంద‌ని ఫిర్యాదు అందుకున్న పోలీసులు .. త‌లుపులు బ‌ద్దలు కొట్టి లోప‌లికి వెళ్లి చూసి నివ్వెర‌పోయారు. త‌ల్లిదండ్రులు చ‌నిపోయి నేలపై ప‌డిపోయి ఉండ‌గా.. వారి మ‌ధ్య రోజుల వ‌య‌సున్న శిశువు స‌జీవంగా ఉన్నాడు. డెహ్రాడూన్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌కు చెందిన క‌షీఫ్ (25), ఆనం (21) ల‌కు ఏడాది క్రిత‌మే వివాహం కాగా వీరికి ఆరు రోజుల క్రితం మ‌గ […]

  • Publish Date - June 15, 2023 / 04:27 AM IST

Dehradun

డెహ్రాడూన్: ఓ ఇంటి నుంచి దుర్వాస‌న వ‌స్తోంద‌ని ఫిర్యాదు అందుకున్న పోలీసులు .. త‌లుపులు బ‌ద్దలు కొట్టి లోప‌లికి వెళ్లి చూసి నివ్వెర‌పోయారు. త‌ల్లిదండ్రులు చ‌నిపోయి నేలపై ప‌డిపోయి ఉండ‌గా.. వారి మ‌ధ్య రోజుల వ‌య‌సున్న శిశువు స‌జీవంగా ఉన్నాడు.

డెహ్రాడూన్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌కు చెందిన క‌షీఫ్ (25), ఆనం (21) ల‌కు ఏడాది క్రిత‌మే వివాహం కాగా వీరికి ఆరు రోజుల క్రితం మ‌గ శిశువు జ‌న్మించాడు.

క‌షీఫ్ క్రేన్ ఆప‌రేట‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా.. ఆనం ఇంట్లోనే ఉంటోంది. నాలుగు నెల‌ల క్రిత‌మే వీరు ఈ ఇంట్లోకి అద్దెకు దిగారు. ఏ క‌ష్ట‌మొచ్చిందో తెలియ‌దు కానీ మూడు రోజుల క్రితం ఈ జంట ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.

దీంతో ఆరు రోజుల వ‌య‌సున్న శిశువు వారి మృత‌దేహాల ప‌క్క‌నే అలా ఉండిపోయాడు. నీరు, త‌ల్లి పాలు లేకుండా శిశువు మూడు రోజులు జీవించి ఉండ‌టం స్థానికంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

పోలీసులు చిన్నారిని వెంట‌నే గ‌వ‌ర్న‌మెంట్ డూన్ మెడిక‌ల్ కాలేజ్, హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లించారు. శిశువు డీహైడ్రేష‌న్‌కు గుర‌యింద‌ని కానీ ప్రాణాల‌కు ముప్పు లేద‌ని వైద్యులు తెలిపారు. ఆర్థిక స‌మ‌స్య‌ల వ‌ల్లే క‌షీఫ్ జంట ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Latest News