Site icon vidhaatha

Nalgonda: కాలువల్లో మహిళల మృతదేహాలు

విధాత: నల్గొండ జిల్లా పరిధిలో వేర్వేరు చోట్ల కాలువల్లో ఇద్దరు మహిళల మృతదేహాలు వెలుగుచూశాయి. అనుముల మండలం హాలియా వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువలో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలు నిడమనూర్‌కు చెందిన విశ్వశ్రీ నైపుణ్య( 23 )గా గుర్తించారు. కుటుంబ కలహాల నేపధ్యంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నల్లగొండ పట్టణం సమీపంలోని మర్రిగూడ వద్ద ఏఎమ్మార్పీ కాలువలో గుర్తుతెలియని మహిళ(35) మృతదేహం లభించింది. ఆమె వివరాలు తెలియరాలేదు. ప్రమాదవశాత్తు కాలువలో పడిందా లేక ఆత్మహత్యకు పాల్పడిందా.. మరెవరైన ఆమెను హత్య చేసి కాలువలో పడేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది. నల్గొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version