Nose Pin | ముక్కుపుడక.. మహిళల అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే భారతీయ మహిళలు ఈనోస్ పిన్స్ (Nose Pin)ను పెట్టుకునేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే, అందాన్ని పెంచే ఈ ముక్కుపుడక.. మహిళల ప్రాణాలకు ముప్పుగా మారింది. ముక్కుపుడక విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రాణాల (womans life) మీదకు తెచ్చుకున్నట్లే. ఇందుకు తాజాగా జరిగిన ఓ ఘటనే నిదర్శనం.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
ఓ మహిళ ముక్కుపుడకను ధరించింది. అయితే, ముక్కు లోపలి భాగంలో ఉన్న పిన్‌ను సరిగ్గా సెట్ చేసుకోలేదు. అది లూజుగా ఉంది. ఇది సదరు మహిళ గమనించుకోలేదు. ఊపిరి తీసుకునే సమయంలో ఆ నోస్ పిన్ కాస్తా ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించింది. ఫలితంగా ఆ మహిళకు ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ఎక్స్‌రేలో బయటపడ్డ విషయం..
సదరు మహిళ వెంటనే వైద్యులను సంప్రదించింది. అక్కడ ఆమె ఊపిరితిత్తులను వైద్యులు ఎక్స్‌రే తీయగా.. షాకింగ్ విషయం బయటపడింది. ఊపిరితిత్తుల్లో నోస్ పిన్ ఇరుక్కుపోయినట్లు తేలింది. ఈ విషయం తెలుసుకున్న సదరు మహిళ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇక వైద్యులు చికిత్స చేసి ఆ నోస్‌పిన్‌ను బయటకు తీశారు. దీంతో ఆమె ప్రమాదం నుంచి బయటపడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సదరు వైద్యుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం కాస్తా వెలుగులోకి వచ్చింది.
వైద్యుల కీలక సూచనలు..
ఈ సందర్భంగా వైద్యులు మహిళలకు కీలక సూచనలు చేస్తున్నారు. అందం ఎంత ముఖ్యమో.. ఆరోగ్యమూ అంతే ముఖ్యమని చెబుతున్నారు. స్నానం చేసేటైమ్‌లో, లేదంటే నోస్‌ను క్లీన్ చేసుకునేటప్పుడు పిన్స్ లూజ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. నోస్ పిన్స్ విషయంలో మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ముప్పు అని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
New Passport Rules 2026 | ఈ 15వ తేదీ నుండి పాస్‌పోర్ట్ అతి సులభంగా పొందొచ్చు
Reels | యువతి ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి.. ఉరేసుకునే సీన్ రికార్డు చేస్తూ..
