Reels | యువతి ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి.. ఉరేసుకునే సీన్ రికార్డు చేస్తూ..
రీల్స్ పిచ్చికి ఓ మహిళ బలైంది. యూపీకి చెందిన ఓ మహిళ (UP woman) ఉరి వేసుకునే దృష్యాన్ని చూపించేలా (hanging scene ) రీల్ చేస్తూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది (woman loses her life While Filming Reel).
Reels | ప్రస్తుతం రీల్స్ (Reels) ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరూ.. రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోవాలని చూస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాని విచ్చల విడిగా వాడేసుకుంటున్నారు. ప్రాణాలకు తెగించి ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హైలెట్ అవడానికి రీల్స్ (Reels) చేస్తూ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. యూపీకి చెందిన ఓ మహిళ (UP woman) రీల్స్ చిత్రీకరిస్తూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది (woman loses her life While Filming Reel).
ఉరేసుకునే సీన్ చేస్తూ..
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బందా జిల్లాకు చెందిన 27 ఏళ్ల మోహిని అనే యువతికి రీల్స్ అంటే పిచ్చి. నిత్యం ఏదో ఒక రీల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసేది. తాజాగా ఆమె ఉరి వేసుకునే దృష్యాన్ని చూపించేలా (hanging scene ) రీల్ చేయాలనుకుంది. తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి తాడు సిద్ధం చేసింది. రీల్ చేద్దామని స్టూల్‌పైకి ఎక్కి ఆ తాడును మెడకు వేసుకుంది. ఆ తర్వాత వీడియో తీసేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదంలో పడింది. ఆమె పట్టుకోల్పోవడంతో ఆ ఉరి గొంతుకు బిగుసుకుపోయింది. ఆ తర్వాత క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయింది.
నాలుగేళ్ల చిన్నారి గుర్తించి..
ఆ సమయంలో ఇంట్లో తన నాలుగేళ్ల చిన్నారి మాత్రమే ఉంది. ఆ చిన్నారి గదిలోకి వెళ్లి చూడగా.. తల్లి వేలాడుతూ కనిపించింది. వెంటనే కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి మోహినిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని కిందకు దించి.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఇది రీల్ చిత్రీకరిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంగా పోలీసులు తేల్చారు.
ప్రాణాల మీదకు తెచ్చుకోకండి..
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వ్యసనం, రీల్ మేకింగ్‌పై ఉన్న క్రేజ్ ఎంత ప్రాణాంతకరమో ఈ ఘటనే ఉదాహరణ అంటూ హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Renu Desai | ‘ఆ ఘటన నన్ను మార్చేసింది’ .. నాన్‌వెజ్‌కు దూరమవ్వడానికి కారణం వెల్లడించిన రేణూ దేశాయ్
Bengaluru Traffic Problems | ట్రాఫిక్ సమస్యల్లో ప్రపంచ రికార్డు.. టాప్ 5లో రెండు భారతీయ నగరాలు.. ఏవో తెలుసా..?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram