Site icon vidhaatha

Karnataka I మాజీ CM య‌డ్యూర‌ప్ప ఇంటిపై బంజారాల రాళ్ల‌దాడి

విధాత‌: కర్ణాటక(Karnataka) ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన అంతర్గత రిజర్వేషన్లలో తమకు అన్యాయం జరిగిందని బంజారా(Banjaras)లు ఆగ్రహంతో షికారిపురలోని ఆ రాష్ట్ర మాజీ సీఎం యడ్యూరప్ప(EX CM Yaddurappa) ఇంటిపై రాళ్లదాడి చేశారు. వందల మంది బంజారాలు ఇంటి భవనంపైకి రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఆందోళనకారులు బారికేడ్లు తొలిగించి ఇంటిపైకి దూసుకెల్లారు. టైర్లకు నిప్పు అంటించి ఇంటి ప్రాంగణంపైకి విసిరారు. కర్ణాటక ప్రభుత్వం, బీజపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులపై లాఠీఛార్జ్‌ చేసి చెదరగొట్టారు. బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.

Exit mobile version