విధాత: దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రంలోని మోదీ సర్కారు (CENTRAL GOVERNMENT) నెలకు రూ.6,000 నిరుద్యోగ భృతి అందిస్తున్నదన్న మెసేజ్ (MESSAGE)లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రధాన మంత్రి బెరోజ్‌గారీ బత్తా యోజన పథకం కింద ఈ సాయం వస్తున్నదని వాట్సాప్ (WHATSAPP) తదితర సోషల్ మీడియాల్లో హల్‌చల్ అవుతున్నది.
అంతేగాక ఈ పథకంలో సభ్యత్వం కోసం ఈ లింకును క్లిక్ చేయండంటూ ఓ లింక్ కూడా సదరు మెసేజ్‌ల్లో ఉంటున్నది. మొబైల్స్ ద్వారా ఈ లింకులోకి వెళ్లవచ్చని, అప్పుడు నిరుద్యోగ భృతి లబ్ధిదారుల జాబితాలో మీ పేరునూ చేర్చుకోవచ్చని చెప్తున్నారు.
అయితే ఇదో మోసపూరిత సందేశం అని, లింకుపై క్లిక్ చేస్తే నష్టపోయే ప్రమాదం ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) హెచ్చరిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ప్రకటనేదీ చేయలేదని కూడా చెప్తున్నది. ఈ క్రమంలోనే సదరు మెసేజ్‌లు వచ్చినవారు అందులో నిజానిజాలను తెలుసుకోవడానికి ఇలా చేయాలంటూ ట్విట్టర్ ద్వారా కొన్ని సూచనలు చేసింది.
పీఐబీ సూచనల ప్రకారం ఆ మెసేజ్‌ను https://factcheck.pib.gov.in కు లేదా +918799711259 వాట్సాప్ నెంబర్‌కు పంపి అసలు నిజం తెలుసుకోవచ్చు. అలాగే pibfactcheck@gmail.com కు సెండ్ చేయవచ్చు. సరైన సమాచారం కోసం https://pib.gov.in ను సందర్శించవచ్చు.