Medico Preethi | వరంగల్ సీపీని కలిసిన మెడికో ప్రీతి కుటుంబ సభ్యులు

ఆత్మహత్య అంటూ వెల్లడించిన సీపీ అనుమానాలు వ్యక్తం చేసిన తండ్రి కేసు పూర్వపరాలు వివరించిన సీపీ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ కాకతీయు మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని ప్రీతి (Medico Preethi) మృతి కేసు విషయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి.రంగనాథ్ ను శనివారం ప్రీతి కుటుంబ సభ్యులు కలిశారు. ప్రీతి మృతికి ఆత్మహత్య కారణమంటూ శుక్రవారం సిపి వివరాలు వెల్లడించిన నేపథ్యంలో ఆమె తండ్రి నరేందర్, సోదరుడు సిపిని హనుమకొండ లోని […]

  • Publish Date - April 22, 2023 / 01:33 AM IST

  • ఆత్మహత్య అంటూ వెల్లడించిన సీపీ
  • అనుమానాలు వ్యక్తం చేసిన తండ్రి
  • కేసు పూర్వపరాలు వివరించిన సీపీ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ కాకతీయు మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని ప్రీతి (Medico Preethi) మృతి కేసు విషయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి.రంగనాథ్ ను శనివారం ప్రీతి కుటుంబ సభ్యులు కలిశారు. ప్రీతి మృతికి ఆత్మహత్య కారణమంటూ శుక్రవారం సిపి వివరాలు వెల్లడించిన నేపథ్యంలో ఆమె తండ్రి నరేందర్, సోదరుడు సిపిని హనుమకొండ లోని ఆయన కార్యాలయంలో కలిశారు. దీనికి సంబంధించి తెలిసిన సమాచారం ఇలా ఉంది.

ఆత్మహత్య అంటూ స్పష్టం చేసిన సీపీ

ప్రీతి మృతికి సంబంధించి తమకున్న అనుమానాలు, అభిప్రాయాలను సీపీతో మరోసారి తండ్రి పంచుకున్నారు ఈ సందర్భంగా టాక్సీ కాలేజీ, పోస్టుమార్టం తదితర రిపోర్టర్లకు సంబంధించిన వివరాలను సీపీ వారికి వివరించారు. ప్రీతి ఆత్మహత్య చేసుకుందనే విషయానికి సంబంధించి ఆధారాలను తండ్రికి తెలియజేశారు.

అనుమానాలు వ్యక్తం చేసిన తండ్రి

ఇదిలా ఉండగా ప్రీతి మృతి విషయంలో తండ్రి నరేందర్ మొదటి నుంచి తన బిడ్డది ఆత్మహత్య కాదని హత్య అంటూ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని, పథకం ప్రకారం తన బిడ్డను హత్య చేశారంటూ ఆరోపించారు. సోదరుడు కూడా ఇదే విషయాన్ని పలుమార్లు మీడియా ముందు వెల్లడించారు.

తమ సోదరికి సంబంధించిన రక్త మార్పిడి కూడా జరిగినందున శరీరంలో ఎలాంటి అవశేషాలు బయటపడే అవకాశం లేదని, కావాలని ఈ విషయంలో నిందితుడిని రక్షించేందుకు వ్యవహరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రీతి ఆత్మహత్య అంటూ సీపీ ప్రకటించిన విషయం సందర్భంలో మరోసారి తమ అనుమానాలను సిపి వద్దనివృత్తి చేసుకున్నారు. కేసు ప్రస్తుత స్థితి పూర్వపరాలను కూడా సీపీ ఈ సందర్భంగా వివరించినట్లు సమాచారం.

Latest News