Site icon vidhaatha

Pele | ఫుట్‌బాల్ దిగ్గ‌జం పీలే కన్నుమూత..

క్యాన్స‌ర్‌తో పోరాడుతూ మృతి

Pele | ఫుట్ బాల్ చ‌రిత్ర‌లోనే అత్యంత మేటి ఆట‌గాళ్ల‌లో ఒక‌డైన పీలే ఇక లేరు. గ‌త కొంత‌కాలం నుంచి క్యాన్స‌ర్‌తో పోరాడుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. చెప్పులు లేని పేద‌రికం నుంచి ఆధునిక చ‌రిత్ర‌లో గొప్ప‌, ప్ర‌సిద్ధ అథ్లెట్ల‌లో ఒక‌రిగా ఎదిగాడు పీలే. మూడుసార్లు ప్ర‌పంచ క‌ప్ గెలిచిన ఏకైక వ్య‌క్తిగా పీలే చరిత్ర పుట‌ల్లోకి ఎక్కారు.

బ్రెజిల్‌కు చెందిన 82 ఏండ్ల పీలే.. సావోపాలోని ఆల్బ‌ర్ట్ ఐన్‌స్టీన్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. గ‌తేడాది పెద్ద‌పేగు క్యాన్స‌ర్ బారిన ప‌డిన పీలే.. చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం ఆయ‌న ఆరోగ్యం విష‌మించ‌డంతో.. అవ‌య‌వాలు ప‌నిచేయ‌డం లేదు. ఈ క్ర‌మంలో మృత్యువుతో పోరాడుతూ గురువారం రాత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.

పీలే అసలు పేరు ఎడ్సన్ అరాంట్స్‌ డో నాసిమియాంటో. ఈయ‌న‌కు ముగ్గురు భార్య‌లు. మొద‌టి భార్య రోజ్‌మెరి, రెండో భార్య అసిరియా లెమోస్, మూడో భార్య మార్సియా. ఏడు మంది సంతాన క‌ల‌గ‌గా, ఇందులో న‌లుగురు చ‌నిపోయారు.

1956లో శాంటోస్‌ క్లబ్‌లో పీలే చేరారు. 17 ఏండ్ల వయస్సులోనే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో బ్రెజిల్‌కు ప్రాతినిథ్యం వహించారు. 1958లో స్వీడెన్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో జట్టులో ప్రధానపాత్ర పోషించారు.
1958, 1962, 1970లో తన జట్టుకు ప్రపంచకప్‌లు అందించాడు.

ఫార్వర్డ్‌గా, అటాకింగ్‌ మిడ్‌ఫీల్డర్‌గా గ్రౌండ్‌లో పాదరసంలా కదిలే పీలే మొత్తంగా నాలుగు ప్రపంచకప్‌లలో ఆడారు. 1971 జులైలో యుగోస్లేవియాతో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ఫుట్‌బాల్‌ దిగ్గజం.. సుమారు రెండు దశాబ్దాలపాటు ప్రేక్షకులను అలరించారు.

Exit mobile version