Donald Trump | ట్రంప్‌ మరో సంచలనం.. భారత్‌పై 500 శాతం సుంకాలు..?

Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్‌, చైనా దేశాలపై సుంకాలను 500 శాతం పెంచేందుకు రూపొందించిన కీలక బిల్లుకు ట్రంప్‌ తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

Donald Trump

Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి చమురు (Russian oil) కొనుగోలు చేస్తూ.. తద్వారా ఉక్రెయిన్‌లో పుతిన్‌
సృష్టిస్తున్న మారణహోమానికి నిధులు సమకూరుస్తున్న భారత్ (India)‌, చైనా, బ్రెజిల్‌ వంటి దేశాలపై భారీ ఆంక్షలకు సిద్ధమయ్యారు. ఆయా దేశాలపై సుంకాలను 500 శాతం పెంచేందుకు రూపొందించిన కీలక బిల్లుకు ట్రంప్‌ తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని రిపబ్లికన్‌ సెనేటర్‌ లిండ్సే గ్రాహమ్‌ (Lindsey Graham) సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన కీలక సమావేశం అనంతరం లిండ్సే గ్రాహమ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. గత కొన్ని నెలలుగా డెమోక్రాట్‌ సెనేటర్‌ రిచర్డ్‌ బ్లూమెన్‌థాల్‌తో కలిసి తాను పనిచేస్తున్న రష్యా ఆంక్షల బిల్లుకు ట్రంప్‌ అనుమతి ఇచ్చారని ఆయన చెప్పారు. ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్‌ జరగనున్నట్లు వెల్లడించారు. ఈ బిల్లుపై త్వరితగతిన ముందుకుసాగుతామని తెలిపారు.

కాగా, రెండోసారి అధికారం చేపట్టిన ట్రంప్‌.. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య సాగుతున్న సుదీర్ఘ యుద్ధాన్ని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే.. రష్యాతో వ్యాపారం సాగిస్తున్న దేశాలను
టార్గెట్‌ చేశారు. రష్యా చమురు కొనుగోలు కారణం చూపి భారత్‌, చైనా, బ్రెజిల్‌ దేశాలపై ట్రంప్‌ భారీగా సుంకాలు వడ్డించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత వస్తువులపై సుమారు 50 శాతం టారిఫ్‌లు
కొనసాగుతున్నాయి. రష్యాతో భారత్ వాణిజ్యం కొనసాగితే సుంకాలు మరింత పెంచుతామని ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించారు కూడా. ఇదిలా ఉండగా, భారత్–అమెరికా మధ్య ప్రస్తుతం కీలకమైన వాణిజ్య
చర్చలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

Poonam Kaur | వివాదాలకు కేంద్రంగా పూనమ్ కౌర్ వ్యాఖ్యలు.. కొట్ట‌డంతో ఆయ‌న భార్య కోమాలోకి..
Mushrooms Cultivation | మామిడి తోట‌లో పుట్ట‌గొడుగుల సాగు.. రోజుకు రూ. 10 వేలు సంపాదిస్తున్న పీజీ గ్రాడ్యుయేట్

Latest News