Poonam Kaur | వివాదాలకు కేంద్రంగా పూనమ్ కౌర్ వ్యాఖ్యలు.. కొట్ట‌డంతో ఆయ‌న భార్య కోమాలోకి..

Poonam Kaur | తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పుడు సుప‌రిచిత‌మైన‌ నటి పూనమ్ కౌర్, తెరపై కనిపించక చాలా కాలమే అవుతోంది. 2022లో వచ్చిన ‘నాతిచరామి’ తర్వాత ఆమె కొత్త సినిమాలు చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం తన ఉనికిని నిలబెట్టుకుంటూనే ఉంది. ముఖ్యంగా మహిళల హక్కులు, సామాజిక అసమానతలు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలపై ఆమె చేసే వ్యాఖ్యలు తరచూ చర్చనీయాంశంగా మారుతుంటాయి

Poonam Kaur | తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పుడు సుప‌రిచిత‌మైన‌ నటి పూనమ్ కౌర్, తెరపై కనిపించక చాలా కాలమే అవుతోంది. 2022లో వచ్చిన ‘నాతిచరామి’ తర్వాత ఆమె కొత్త సినిమాలు చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం తన ఉనికిని నిలబెట్టుకుంటూనే ఉంది. ముఖ్యంగా మహిళల హక్కులు, సామాజిక అసమానతలు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలపై ఆమె చేసే వ్యాఖ్యలు తరచూ చర్చనీయాంశంగా మారుతుంటాయి.ఇటీవల పూనమ్ చేసిన ఓ ట్వీట్ మరోసారి వివాదానికి దారితీసింది. పేరు ప్రస్తావన లేకుండానే, “ఇతరుల జీవితాలను కూల్చి సొంత భవనం కట్టుకున్నట్టు” అంటూ చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలకు కారణమయ్యాయి. నెటిజన్లు ఆ ట్వీట్‌ను ఒక ప్రముఖ హీరోయిన్‌ను ఉద్దేశించి చేసిందని భావించగా, ఆ ఆరోపణలపై పూనమ్ మౌనం వీడింది.

ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన పోస్టులు సరదాగా కాకుండా, తన మనసును గాయపరిచిన ఘటనలపై స్పందనగా వస్తాయని స్పష్టం చేసింది. అదే సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. “తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక డైరెక్టర్, ఒక హీరోయిన్ మోజులో పడి తన భార్యపై దాడి చేశాడు. ఆ మహిళ తీవ్రంగా గాయపడి కొన్ని రోజుల పాటు కోమాలో ఉండాల్సి వచ్చింది” అంటూ పూనమ్ ఆరోపణలు చేసింది. ఈ ఘటన బయటకు రాకపోవడానికి కారణం కూడా ఆమె వెల్లడించింది. “ఆ మహిళ తన భర్త జీవితాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని బయట పెట్టలేదు. ఆడియో ఫంక్షన్‌లో కూడా ఆ హీరోయిన్ పక్కనే కూర్చుంది. ఏమీ చెప్పలేదు. మన సమాజంలో ఇలాంటి హోమ్‌మేకర్స్ చాలా మంది ఉంటారు” అని ఆమె వ్యాఖ్యానించింది.

అయితే, ఈ వ్యవహారంలో ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో పూనమ్ పేర్లు చెప్పలేదు. డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ ఎవరు? అన్న వివరాలు వెల్లడించకపోవడంతో, సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. నెటిజన్లు రకరకాల పేర్లను చర్చించుకుంటుండగా, ఈ వ్యాఖ్యలు ఎంతవరకు నిజమన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.పూనమ్ కౌర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇండస్ట్రీలోని అంతర్గత విషయాలపై ఆమె చేసిన ఆరోపణలు నిజమైతే పెద్ద దుమారమే రేగే అవకాశముంది. మరోవైపు, పేర్లు చెప్పకుండా ఇలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమన్న చర్చ కూడా కొనసాగుతోంది.

Latest News