Nayan Wedding Celebration: ప్రముఖ హీరోయిన్ నయనతార-విఘ్నేశ్ శివన్ దంపతులు తమ పెళ్లీ రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. నయనతార-విఘ్నేశ్ శివన్ ల మూడో వివాహ వార్షికోత్సవం సందర్భంగా విహార యాత్రలో వారు దిగిన ఫోటోలను నయన్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. మనంలో మనం ఎవరం ఎక్కువగా ప్రేమిస్తామనే విషయంలో ఆశ్చర్యపోతోంటాం.. ఆ ప్రశ్నకు మాత్రం ఎప్పుడూ మన మధ్య సమాధానం దొరకలేదు.. మన బంధం గురించి వివరించలేం.. నువ్వే నా సర్వస్వం, ప్రపంచం.. ఇద్దరం కాస్తా నలుగురం అయ్యాం.. ఇంత కంటే ఎక్కువగా నేనేం అడగగలను.. ప్రేమంటే ఏంటో.. ప్రేమ ఎలా ఉండాలో నువ్వే నాకు నేర్పించావు.. చూపించావు.. హ్యాపీ యానివర్సరీ మై పార్ట్నర్ అంటూ నయన్ పోస్ట్ చేశారు. నీ ప్రేమను వర్ణించడానికి మాటలు చాలావు అంటూ విఘ్నేశ్ గురించి పేర్కొన్నారు. ఇద్దరుగా ప్రారంభమైన మన ప్రయాణం నలుగురిగా మారిందని పిల్లల ఫోటోలతో కూడిన విఘ్నేశ్..నయన్ ల ఫోటోలను ఆమె షేర్ చేశారు. ఆ ఫోటోలను చేసిన నయన్ అభిమానులు వారు వైవాహిక జీవితం అంతే సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటున్నారు.
నయన్.. విఘ్నేష్ శివన్ ప్రేమపెళ్లి మొదటి నుంచి కూడా సినీ అభిమానుల్లో ఆసక్తికర టాపిక్ గా సాగింది. గతంలో ప్రభుదేవా..శింబులతో నయన తార ప్రేమలో పడటం..ఆ తర్వాత విఘ్నేష్ శివన్ ను 2022జూన్ 9న ప్రేమపెళ్లి చేసుకోవడం తెలిసిందే. పెళ్లి తర్వాతా ఈ జంట సరోగసి పద్దతిలో కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు.