Sai Pallavi | నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గ్లామర్‌కు దూరంగా ఉండ‌టానికి అస‌లు కార‌ణం ఏంటి?

Sai Pallavi | మాలీవుడ్‌లో మలర్, టాలీవుడ్‌లో బుజ్జి తల్లి, కోలీవుడ్‌లో ఆనంది, శాండల్‌వుడ్‌లో గార్గి, బాలీవుడ్‌లో సీత.. ఇలా ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో పేరుతో అభిమానుల మనసులు గెలుచుకున్న నటి సాయి పల్లవి. నేచురల్ బ్యూటీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తక్కువ మేకప్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకునే అరుదైన హీరోయిన్‌గా నిలిచారు. “మేకప్ లేకున్నా అందంగా కనిపించే నటి ఎవరైనా ఉన్నారంటే అది సాయి పల్లవే” అని అభిమానులు చెబుతుంటారు.

Sai Pallavi | మాలీవుడ్‌లో మలర్, టాలీవుడ్‌లో బుజ్జి తల్లి, కోలీవుడ్‌లో ఆనంది, శాండల్‌వుడ్‌లో గార్గి, బాలీవుడ్‌లో సీత.. ఇలా ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో పేరుతో అభిమానుల మనసులు గెలుచుకున్న నటి సాయి పల్లవి. నేచురల్ బ్యూటీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తక్కువ మేకప్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకునే అరుదైన హీరోయిన్‌గా నిలిచారు. “మేకప్ లేకున్నా అందంగా కనిపించే నటి ఎవరైనా ఉన్నారంటే అది సాయి పల్లవే” అని అభిమానులు చెబుతుంటారు. ఇతర హీరోయిన్లతో పోలిస్తే సాయి పల్లవి మేకప్‌ను చాలా తక్కువగా ఉపయోగిస్తారు. పాత్రకు అవసరమైతే తప్ప, గ్లామర్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే దుస్తులు ధరించరు. ముఖ్యంగా పొట్టి బట్టలు, శరీరాన్ని ప్రదర్శించే డ్రెస్సులను ఆమె స్పష్టంగా దూరంగా ఉంచుతారు. ఇది ఆమె వ్యక్తిత్వంలో భాగమే కాకుండా, ఆమె తీసుకున్న ఒక స్పష్టమైన నిర్ణయానికి ప్రతిబింబం.

సాధారణంగా సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు అంటే హీరోయిన్లు మోడ్రన్ డ్రెస్సులతో హాట్ లుక్‌లో కనిపించడం సర్వసాధారణం. కానీ సాయి పల్లవి మాత్రం ఆ ట్రెండ్‌కు భిన్నంగా, శరీరం పూర్తిగా కప్పుకునేలా ఉండే సంప్రదాయ లేదా సింపుల్ దుస్తులనే ఎక్కువగా ఎంచుకుంటారు. ఈ విషయంలో ఆమె రూట్ పూర్తిగా వేరుగా ఉంటుంది. ఈ నిర్ణయానికి కారణం ఏమిటనే ప్రశ్నకు సాయి పల్లవి గతంలో ఓ ఇంటర్వ్యూలో స్పష్టమైన సమాధానం ఇచ్చారు. తన కాలేజీ రోజుల్లో జరిగిన ఒక సంఘటన తన ఆలోచనలను మార్చిందని ఆమె వెల్లడించారు. కాలేజీ రోజుల్లో ఒక డ్యాన్స్ పోటీలో పాల్గొన్న సమయంలో ఆమె స్లిట్ డ్రెస్ ధరించగా, ఆ డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. అయితే ఆ వీడియోకు వచ్చిన కొన్ని కామెంట్లు తనను తీవ్రంగా కలచివేశాయని సాయి పల్లవి తెలిపారు.

“కొంతమంది నా ప్రతిభను గమనించకుండా, కేవలం నా శరీరంపైనే దృష్టి పెట్టి కామెంట్లు చేశారు. అది నాకు చాలా డిస్టర్బ్ చేసింది. ఆ రోజు తర్వాత నా శరీరం ఎక్కువగా కనిపించే దుస్తులు ధరించకూడదని నిర్ణయించుకున్నాను” అని సాయి పల్లవి చెప్పింది. అప్పటి నుంచే ఆమె తన కంఫర్ట్‌, తన విలువలకు అనుగుణంగా దుస్తులు ఎంచుకుంటూ వస్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి కెరీర్ పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతోంది. చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉండగా, ముఖ్యంగా రాకింగ్ స్టార్ యశ్, రణబీర్ కపూర్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’ లో సీత పాత్రలో ఆమె కనిపించనుంది. ఈ సినిమాతో సాయి పల్లవి బాలీవుడ్‌లోనూ తన ప్రత్యేక ముద్ర వేయనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ఆమె రెమ్యునరేషన్ కూడా గణనీయంగా పెరిగిందని సమాచారం. గ్లామర్‌కు దూరంగా, సహజత్వాన్ని తన బలంగా మార్చుకున్న సాయి పల్లవి ప్రయాణం, ఈ తరం హీరోయిన్లకు ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తోంది.

Latest News