Learjet 45 : వీఐపీలు మెచ్చిన జెట్‌.. అజిత్‌ పవార్‌ ప్రాణాలు తీసిన లియర్‌జెట్ 45 ప్రత్యేకతలివే..

అజిత్ పవార్ ప్రయాణించిన లియర్‌జెట్ 45 జెట్ బారామతిలో కుప్పకూలి 9 మంది ప్రాణాలు కోల్పోయారు భద్రతా విచారణ జరుగుతోంది.

Bombardier Learjet 45

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ (Ajit Pawar) దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతి (Baramati)లో కుప్పకూలిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తిన నేపథ్యంలో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించిన సమయంలో అదుపుతప్పి కుప్పకూలిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో అజిత్‌ పవార్‌తోపాటూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సహా పలువురు అజిత్‌ పవార్‌ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అజిత్‌ పవార్‌ ప్రయాణించిన విమానం గురించి ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఆ విమానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వీఐపీలు మెచ్చిన జెట్‌..

ప్రమాదానికి గురైన విమానం ఓ ప్రైవేట్‌ జెట్‌. ఢిల్లీకి చెందిన వీఎస్‌ఆర్‌ ఏవియేషన్‌ సంస్థకు చెందిన లియర్‌జెట్ 45 (Learjet 45) విమానం. ఈ సంస్థకు దేశీయ ప్రైవేట్‌ విమానయాన రంగంలో కీలక స్థానం ఉంది. ఈ రంగంలో సంస్థకు 15 ఏండ్ల అనుభవం ఉంది. లియర్‌జెట్ 45 అనేది కెనడాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బాంబార్డియర్ (Bombardier Aerospace) రూపొందించిన మిడ్-సైజ్ బిజినెస్ జెట్. 1990ల చివర్లో మార్కెట్లోకి వచ్చిన ఈ విమానం ఇప్పటికీ ప్రైవేట్ చార్టర్ రంగంలో విస్తృతంగా వినియోగంలో ఉంది. కార్పొరేట్‌ ప్రయాణాలు, వీఐపీ చార్టర్‌ సేవలు, అత్యవసర అవసరాల కోసం ఈ తరహా జెట్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా వీఐపీలు మెచ్చిన జెట్‌గా దీనికి పేరుంది. ఇది చిన్న చిన్న విమానాశ్రయాల కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది.

3 వేల కి. మీటర్లకు పైగా ఏకదాటిగా ప్రయాణించే సామర్థ్యం

ఇది ట్విన్‌ ఇంజిన్‌ జెట్‌. ఇది ఒక సూపర్ లైట్ మీడియం సైజ్ బిజినెస్ జెట్. ఈ విమానం 47 అడుగుల విస్తీర్ణం, 9,752 కిలోల బరువు కలిగి ఉంటుంది. ఇందులో సాధారణంగా 8 నుంచి 9 మంది ప్రయాణించొచ్చు. ఈ విమానం గంటకు గరిష్టంగా 860 కిమీ వేగంతో దూసుకెళ్లగలదు. గరిష్ఠంగా 51,000 అడుగుల ఎత్తు వరకూ ఎగరగలదు. ఇందులో ఒక్కసారి ఇంధనం నింపితే సుమారు 3,000 కిలోమీటర్లకు పైగా ఏకదాటిగా ప్రయాణించగల సామర్థ్యం ఉంది. ప్రమాదానికి గురైన విమానం దేశంలో అతిపెద్ద నాన్-షెడ్యూల్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్లలో ఒకటి.

2023లోనూ..

ఈ లియర్‌జెట్‌ 2023లో కూడా ఓ సారి క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. 2023 సెప్టెంబర్ 14న ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇదే కంపెనీకి చెందిన మరో విమానం ప్రమాదానికి గురైంది. భారీ వర్షం కారణంగా ముంబై ఎయిర్‌పోర్టులో కుప్పకూలి రెండు ముక్కలైంది. అయితే, ఆ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అందులోని ఆరుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నేడు జరిగిన ఘటనలో అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోవడం ఆ కంపెనీ భద్రతా ప్రమాణాలపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.

100 శాతం సేఫ్‌

అయితే, విమానంలో ఎలాంటి భద్రతా సమస్యలూ లేవని వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌ అధికారులు తెలిపారు. ఈ విమానం 100 శాతం సురక్షితమని సంస్థ ఉన్నతాధికారి విజయ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. దీన్ని ఆపరేట్‌ చేసే సిబ్బంది చాలా అనుభవజ్ఞులు అని పేర్కొన్నారు. ప్రమాదానికి దృశ్యమానత తక్కువగా ఉండటం ఓ కారణం కావొచ్చన్నారు. అయితే, డీజీసీఏ దర్యాప్తు అనంతరం ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలుస్తాయని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :

Avalanche Swallows Sonamarg : సోనామార్గ్‌ను ముంచెత్తిన అవలాంచ్‌.. భయానక దృశ్యాలు
US Iran War | ఇరాన్ వైపు మరిన్ని యుద్ద నౌకలు : ట్రంప్

Latest News