విధాత : కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ చేసింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆధార్ కొత్త యాప్‌ను జాతికి అంకితం చేశారు. దేశ ప్రజలకు డిజిటల్ మౌలిక సదుపాయాలను సులభతరం చేసేందుకు, డిజిటల్ సేవలను బలోపేతం చేసేందుకు యూఐడీఏఐ కొత్త ఆధార్ యాప్ తీసుకొచ్చినట్లుగా కేంద్రం పేర్కొంది. కొత్త ఆధార్ యాప్‌తో ఆధార్ సర్వీసులు మరింత సరళంగా, సురక్షితంగా, యూజర్ ఫ్రెండ్లీగా మారనున్నాయని తెలిపింది. కొత్త ఫుల్ వెర్షన్ యాప్ లో మొత్తం 5 కీలక ఫీచర్లు ఉన్నాయి.
ఈ యాప్ ద్వారా ఆధార్ వివరాలను ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా సులభంగా అప్డేట్ చేయవచ్చు. ఆధార్ డేటాను అప్‌డేట్ చేయాలంటే ఇప్పటిదాకా ఆధార్ సెంటర్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు మొబైల్ ద్వారా ఆన్‌లైన్ ద్వారా వివరాలు సవరించుకోవచ్చు. కొత్త యాప్‌లో ముఖ్యంగా మొబైల్ నంబర్ అప్డేట్ ఫీచర్‌ను జోడించారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఎక్కడ ఉన్నా తమ ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు.
మొబైల్ నెంబర్ ఎలా మార్చుకోవాలి?
ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ బ్యాకింగ్ సేవలకు ,ప్రభుత్వ పథకాలను పొందడంలో కీలకంగా మారింది. బ్యాంక్ KYC కోసం OTP అవసరమైనప్పుడు ఆధార్‌లో నమోదైన నంబర్‌కు మాత్రమే OTP వస్తుంది. కానీ కొంత మంది వారి మొబైల్ నంబర్‌ను తరచుగా మార్చుకుంటారు. అలాంటి సందర్భాల్లో నంబర్ అప్డేట్ చేయకపోతే OTP రాకపోవడం వల్ల సేవలు పొందలేరు. కొత్త ఆధార్ యాప్ తో ఇంటి నుంచే మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు.
ఇలా ఫోన్ నంబర్ మార్చుకోవచ్చు…
Google Play Storeలో “Aadhaar” అని సెర్చ్ చేయాలి..ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి, Mobile Number Update ఆప్షన్ ఎంచుకోవాలి,
కొత్త మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, డోబ్ వివరాలు నమోదు చేసి OTP ద్వారా ధృవీకరించాలి, కొన్ని రోజుల్లో మీ ఆధార్‌లో నంబర్ అప్డేట్ అవుతుంది. Update Status లోకి వెళ్లి ఆప్డేడ్ పరిస్థితిని తనిఖీ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి :
Sicily Landslide : విరిగిపడిన కొండ చరియలు..కూలిన ఇళ్ల వీడియో వైరల్
Avalanche Swallows Sonamarg : సోనామార్గ్‌ను ముంచెత్తిన అవలాంచ్.. భయానక దృశ్యాలు
