Havan Statue Of Liberty Collapses : స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూలిపోయింది !

బ్రెజిల్‌లోని గుయిబాలో భారీ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం (ప్రతిక) బలమైన గాలుల ధాటికి కూలిపోయింది. హవాన్ మెగాస్టోర్ వెలుపల ఉన్న ఈ 24 మీటర్ల విగ్రహం, గంటకు 90 కి.మీ వేగంతో వీచిన తుపాను గాలులకు నెలకొరిగింది.

Havan Statue Of Liberty Collapses

విధాత: స్వేచ్చా ప్రతిక గా భావించే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం కూలిపోయింది. బలమైన గాలుల ధాటికి అంతపెద్ద భారీ విగ్రహం అమాంతంగా నెలకొరిగింది. అయితే కూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం అమెరికాలో కాదండోయ్..బ్రెజిల్ దేశంలోనిది కావడం గమనార్హం.

దక్షిణ బ్రెజిల్‌లోని 24మీటర్ల స్టాట్యూ ఆఫ్ లిబర్టీ భారీ విగ్రహం తీవ్ర తుఫాన్ సందర్బంగా వీచిన బలమైన గాలులకు కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బ్రెజిల్‌లోని రియో ​​గ్రాండే డో సుల్‌లోని గుయిబాలోని హవాన్ మెగాస్టోర్ వెలుపల స్టాట్యూ ఆఫ్ లిబర్టీ యొక్క విగ్రహాన్ని నెలకొల్పారు. గంటకు 80-90 కి.మీ వేగంతో గాలులు వీచడంతో ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కూలిపోయిందని గుయిబా మేయర్ మార్సెలో మారనాటా ధృవీకరించారు, అయితే హవాన్ సిబ్బంది నగర ప్రజలకు ముందస్తుగా తుపాన్ హెచ్చరికలు చేయడంతో విగ్రహం కూలిన ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. వెంటనే శిథిలాలను తొలగించడం జరిగిందని తెలిపారు.

తీవ్ర గాలుల ధాటికి విగ్రహం నెమ్మదిగా ముందుకు వంగి ఖాళీ పార్కింగ్ స్థలంలోకి పడిపోయింది. 90 కిలో మీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీచడంతో విగ్రహం కూలిపోయింది. సమీపంలోని రద్దీగా ఉండే రహదారిపై వాహనాలు కదులుతుండగా విగ్రహం వంగి నేలపై కూలిపోతున్న వీడియో వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటనలో విగ్రహం కూలిపోయినప్పటికి దాని 11మీటర్ల బేస్ (పీఠం) మాత్రం దృఢంగానే ఉండటం విశేషం. కాగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అసలైన విగ్రహం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. బ్రెజిల్‌లోని హవాన్ అనే డిపార్ట్‌మెంటల్ స్టోర్ చైన్ బ్రాండ్ గుర్తుగా 2020లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

గుయిబాలో తుపాన్ రియో గ్రాండే డో సుల్‌ను కూడా చాలా వరకు ప్రభావితం చేసింది. వడగళ్ల వాన, పైకప్పులు, చెట్లు, కూలిపోవడం, విద్యుత్తు అంతరాయం లాంటి సంఘటనలు చోటు చేసు కున్నాయి. భారీ వర్షం కారణంగా కొన్ని వీధులు జలమయమయ్యాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటియాలజీ తుపాన్ హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. చలిగాలులే దీనికి కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. తేలికపాటి వర్షం ఉన్నప్పటికీ మంగళ వారం నుండి వాతావరణ పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Tollywood | 2025లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రాలు ఇవే.. ఏ సినిమాకి ఎక్కువ ఆద‌ర‌ణ ల‌భించింది అంటే..!
Abhigyan Kundu : అండర్‌-19 ఆసియా కప్‌లో అభిజ్ఞాన్‌ కుందు డబుల్ సెంచరీ

Latest News