విధాత: అండర్-19 ఆసియా కప్‌లో యువ భారత ఆటగాళ్లు జోరు మీదున్నారు. యూఏఈతో జరిగిన మ్యాచ్ లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 171పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ మరువకముందే ఇదే టోర్నీలో మరో యువ ఆటగాడు అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీ(209*) తో మరో సంచలన ఇన్నింగ్స్ తో మెరిశాడు. దుబాయ్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ సైతం హాఫ్ సెంచరీ(50)తో రాణించాడు.
భారత ఇన్నింగ్స్ లో అభిజ్ఞాన్ కుందు (209* 125బంతుల్లో 17ఫోర్లు, 9 సిక్స్ లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. వేదాంత్ త్రివేది (90, 107 బంతుల్లో 7 ఫోర్లు), సూర్యవంశీ (50 రన్స్, 26బంతుల్లో 5ఫోర్లు, 3సిక్స్ లు ) కీలక ఇన్నింగ్స్ ఆడారు. మలేషియా బౌలర్లలో అక్రమ్ 5 వికెట్లు, కుమారన్, జాష్విన్ తలో వికెట్ తీశారు. 409 పరుగుల భారీ టార్గెట్ చేధించేందుకు మలేసియా బ్యాటర్లు ఎదురీదుతున్నారు.
ఇవి కూడా చదవండి :
Giant Python In Drainage : డ్రైనేజీలో భారీ కొండచిలువ..వైరల్ వీడియో
