Seetha Dayakar Reddy | కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే సీతా ద‌యాక‌ర్ రెడ్డి

Seetha Dayakar Reddy విధాత‌, హైద‌రాబాద్‌: దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి తన అనుచరులతో సోమ‌వారం గాంధీభవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకులకు రేవంత్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, డీసీసీ అధ్యక్షులు జి.మధు సుధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. […]

  • Publish Date - September 11, 2023 / 12:39 AM IST

Seetha Dayakar Reddy

విధాత‌, హైద‌రాబాద్‌: దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి తన అనుచరులతో సోమ‌వారం గాంధీభవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకులకు రేవంత్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, డీసీసీ అధ్యక్షులు జి.మధు సుధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LIVE : Ex MLA Seetha Dayakar Reddy Joins Congress | Revanth Reddy | V6 News

మాన కొండూరు నుంచి..

మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలానికి చెందిన పలువురు బీఆరెస్ నేత‌లు సోమ‌వారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేర‌కు రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని త‌న న‌వివాసంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ దొంతు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు కాలువ మల్లేశం, శ్రీనివాస్ ల‌తో పాటు ప‌లువురు కార్యకర్తలకు పార్టీ కండువ క‌ప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు