Gaddar | గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో ఒకరి మృతి

Gaddar విధాత: గద్దర్ అంత్యక్రియల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడి ఒకరు మృతి చెందారు. ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ పార్ధీవ దేహాన్ని అల్వాల్ లోని గద్దర్ ఇంటికి అంతిమ యాత్రగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గద్దర్ ను చూసేందుకు భారీగా తరలి వచ్చిన గద్దర్ అభిమానులు, ప్రజలు ఇంటిలోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. లోపల అంత మందికి స్థలం సరిపోదని పోలీసులు చెప్పినా వినిపించకుకోకుండా ముందుకు తోసుకురాగా, తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి […]

  • Publish Date - August 7, 2023 / 01:48 AM IST

Gaddar

విధాత: గద్దర్ అంత్యక్రియల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడి ఒకరు మృతి చెందారు. ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ పార్ధీవ దేహాన్ని అల్వాల్ లోని గద్దర్ ఇంటికి అంతిమ యాత్రగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గద్దర్ ను చూసేందుకు భారీగా తరలి వచ్చిన గద్దర్ అభిమానులు, ప్రజలు ఇంటిలోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. లోపల అంత మందికి స్థలం సరిపోదని పోలీసులు చెప్పినా వినిపించకుకోకుండా ముందుకు తోసుకురాగా, తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు.

దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. కాగా తొక్కిసలాట సందర్భంగా గుండెపోటుకు గురైన వ్యక్తి ఉర్దూ పత్రిక సియాసత్ మేనేజింగ్ డైరక్టర్‌ జహిరుద్ధిన్ అలిఖాన్ గా గుర్తించారు. అలిఖాన్ గద్దర్‌కు అత్యంత సన్నిహితుడు. ఆయన ఎల్బీ స్టేడియం నుంచి కూడా గద్దర్ అంతిమ యాత్ర వాహనంలో ఉండి గద్దర్ ఇంటి వద్దకు వచ్చారు.

అలిఖాన్ వాహనం దిగిన సందర్భంలోనే అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుని ఆయన కింద పడిపోయారు. ఊపిరి సమస్యతో బాధపడుతుండగా పలువురు పక్కనే ఉన్న ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లుగా వైద్యులు దృవీకరించారు. తొక్కిసలాట సమయంలో అలిఖాన్‌కు గుండెపోటు రావడంతోనే ఆయన మృతి చెందినట్లు తెలుస్తుంది.

Latest News