Site icon vidhaatha

PM Modi | గద్దర్ మృతిపై ప్రధాని ఆవేదన.. మోడీ లేఖ

PM Modi |

విధాత : ప్రజాకవి గద్దర్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీ ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ సతీమణి విమలకు ప్రధాని రాసిన లేఖలో గద్దర్ మృతి పట్ల తన సంతాపాన్ని వెలిబుచ్చారు. తీశ్ర దుఃఖంలో ఉన్న ఈ సమయంలో కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు, బలహీన వర్గాలు ఎదుర్కోంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయన్నారు.

కాగా.. ఆయన రచనలు ప్రజలలో చైతన్యాన్ని కల్గిస్తాయని, తెలంగాణ సాంప్రదాయక కళారూపాలని పునరుజ్జీవింప చేయడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికి గుర్తిండిపోతుందని, మీ దుఃఖాన్ని మాటల్లో వ్యక్త పరుచలేమని, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ దుఃఖాన్ని తట్టుకున శక్తిని ప్రసాదించాలని కోరుకుంటన్నానని, ఓం శాంతి అంటూ ప్రధాని మోడీ తన లేఖలో సానుభూతి వ్యక్తం చేశారు.

Exit mobile version