Gambling | రూ.5 కోట్లు వ‌చ్చాయ‌ని గ్యాంబ్లింగ్ ఆడాడు.. రూ.58 కోట్లు న‌ష్ట‌పోయాడు

Gambling విధాత‌: తొలుత రూ.5 కోట్ల‌ను గెలుచుకున్నాడు.. వ్యాపారం క‌న్నా గ్యాంబ్లింగ్ (Gambling)లోనే ఎక్కువ సంపాదించొచ్చ‌ని భ్ర‌మ‌ప‌డి ఆఖ‌రికి ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ.58 కోట్ల‌ను న‌ష్ట‌పోయి పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంతంలో జ‌రిగింది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. బాధిత వ్యాపారికి అనంత్ అలియాస్ సొంతు న‌వ్‌ర‌త‌న్ జైన్ అనే బుకీ ప‌రిచయ‌మయ్యాడు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌లో క‌ళ్లు చెదిరే లాభాలు వ‌స్తాయ‌ని న‌మ్మించి అందులోకి దించాడు. తొలుత త‌ట‌ప‌టాయించిన‌ప్ప‌ట‌కీ స‌ద‌రు […]

  • Publish Date - July 24, 2023 / 12:38 AM IST

Gambling

విధాత‌: తొలుత రూ.5 కోట్ల‌ను గెలుచుకున్నాడు.. వ్యాపారం క‌న్నా గ్యాంబ్లింగ్ (Gambling)లోనే ఎక్కువ సంపాదించొచ్చ‌ని భ్ర‌మ‌ప‌డి ఆఖ‌రికి ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ.58 కోట్ల‌ను న‌ష్ట‌పోయి పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంతంలో జ‌రిగింది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. బాధిత వ్యాపారికి అనంత్ అలియాస్ సొంతు న‌వ్‌ర‌త‌న్ జైన్ అనే బుకీ ప‌రిచయ‌మయ్యాడు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌లో క‌ళ్లు చెదిరే లాభాలు వ‌స్తాయ‌ని న‌మ్మించి అందులోకి దించాడు. తొలుత త‌ట‌ప‌టాయించిన‌ప్ప‌ట‌కీ స‌ద‌రు వ్యాపారి మెల్ల‌గా ఇందులోకి వ‌చ్చాడు. రూ.8 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో గ్యాంబ్లింగ్ ఆడ‌టం ప్రారంభించాడు. వాట్స‌ప్ ద్వారా ఒక లింక్‌ను పంప‌గా.. అది గ్యాంబ్లింగ్ ఎకౌంట్‌కు లింక్ అయి ఉండేది. అందులో పెట్టుబ‌డి పెడుతూ గ్యాంబ్లింగ్ ఆడేవాడు. అలా ఒక స‌మ‌యానికి రూ.5 కోట్ల లాభాల‌తో నిల‌బ‌డ్డాడు.

అయితే పెద్ద మొత్తంలో లాభాలు చూద్దామ‌ని ప్ర‌య‌త్నించ‌గా రూ.58 కోట్లు న‌ష్ట‌పోయాడు. దీంతో త‌న డబ్బులు త‌నకి ఇచ్చేయాల‌ని అభ్య‌ర్థించ‌గా జైన్ అందుకు నిరాక‌రించాడు. మోస‌పోయాన‌ని భావించి బుకీ జైన్‌పై స‌ద‌రు వ్యాపారి సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన అధికారులు నాగ్‌పూర్‌కు స‌మీపంలో ఉన్న గోండియా ప‌ట్ట‌ణంలోని నిందితుడి ఇంటిపై రైడ్ చేశారు. నేరానికి సంబంధించిన ప‌లు సాక్ష్యాలు, రూ.14 కోట్ల న‌గ‌దు, నాలుగు కేజీ బంగారం బిస్కెట్లు మొద‌లైన వాటిని స్వాధీనం చేస్తుకున్నారు. ఇంకా ఒక రోజులో లెక్క‌పెట్ట‌డానికి వీలు లేనంత న‌గ‌దును స్వాధీనం చేసుకున్నామ‌ని.. వాటిని లెక్కించి పూర్తి మొత్తాన్ని వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల రాకను ముందే ప‌సిగ‌ట్టిన నిందితుడు జైన్ దుబాయ్ పారిపోయిన‌ట్లు భావిస్తున్నారు.

Latest News