Site icon vidhaatha

వరంగల్‌లో మరో ర్యాగింగ్ ఆత్మహత్య: విద్యార్థి వేధింపులతో ఇంజినీరింగ్ విద్యార్థిని సూసైడ్‌

విధాత, వరంగల్‌ ప్రత్యేక ప్రతినిధి: కేఎంసీ మేడికో డాక్టర్ ప్రీతి మృతి సంఘటన మరువకముందే ఓ విద్యార్థి వేధింపుల కారణంగా ఇంజినీరింగ్ విద్యార్థిని రక్షిత (20) ఆత్మహత్యకు పాల్పడిందనే సంఘటన కలకలం సృష్టిస్తోంది. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి వేధింపులు తాళలేక అదే ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ నగరంలోని రామన్నపేటలో ఆదివారం జరిగింది.

భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కుమార్తె రక్షిత. రామన్నపేటలోని దగ్గరి బంధువుల ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. వరంగల్ జిల్లా నర్సంపేట లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో రక్షిత ఈసీ మూడవ సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో ఓ విద్యార్థి మరో విద్యార్థితో కలిసి ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశాడు.

ఈ సంఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన రక్షిత వరంగల్ నగరంలోని తన బంధువుల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదుచేసి పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇది ఇలా ఉంటే గత రెండు రోజుల క్రితం భూపాలపల్లిలో రక్షితపై మిస్సింగ్ కేస్ నమోదైనట్లు సమాచారం.

Exit mobile version