Adilabad | ఇద్దరు పిల్లల విక్రయం.. ముఠా గుట్టు రట్టు

తొమ్మిది మందిని అరెస్టు చేసిన పోలీసులు బాలల సంరక్షణ కేంద్రానికి శిశువుల తరలింపు విధాత ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలో చిన్నపిల్లల విక్రయం ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారంలో పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. విక్రయించిన ఇద్దరు ఆడ పిల్లలను స్వాధీనం చేసుకొని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పజెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. […]

  • Publish Date - June 1, 2023 / 06:31 AM IST

  • తొమ్మిది మందిని అరెస్టు చేసిన పోలీసులు
  • బాలల సంరక్షణ కేంద్రానికి శిశువుల తరలింపు

విధాత ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలో చిన్నపిల్లల విక్రయం ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారంలో పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. విక్రయించిన ఇద్దరు ఆడ పిల్లలను స్వాధీనం చేసుకొని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పజెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంగారు గూడ కాలనీకి చెందిన గంగాధర్, రాధ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మగబిడ్డకోసం ఎదురుచూస్తున్న ఆ దంపతులకు మళ్లీ ఇద్దరు ఆడపిల్లలు కవలలు పుట్టారు. కొద్దిరోజులకే గంగాధర్ భార్య రాధ అనారోగ్యంతో మృతిచెందింది.

కాగా పిల్లలను పోషించలేక ఇబ్బంది పడుతున్న గంగాధర్‌ను జిల్లా కేంద్రంలో ఉంటున్న ఆర్ఎంపీ వైద్యుడు జగన్నాథ్, బంగారు గూడలో ఉన్న తన స్నేహితుడు షారుక్ తో కలిసి పిల్లలను విక్రయించేందుకు ఒప్పించారు. కర్ణాటకు వెళ్ళి పిల్లలిద్దరిని విక్రయించి వచ్చారు. అయితే.. బాలల సంరక్షణ అధికారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కూపి లాగారు. ప్రత్యేక బృందాన్ని కర్ణాటకకు పంపించి దర్యాప్తు చేపట్టారు.

దీంతో అసలు విషయం బయటపడింది. కర్ణాటకు చెందిన శీతలే రమ, అశోక్ దంపతులు జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం పిల్లలు లేని దంపతులను గుర్తించి వారికి పిల్లలను విక్రయిస్తున్నారు. కూతురు అల్లుడు కోమల్ సూర్యలతో కలిసి ఈ పని చేసేవారు.

అయితే ఆదిలాబాద్ లో స్థిరపడ్డ రమ సోదరుడైన ఆర్.ఎం.పి వైద్యుడు జగన్నాథం, అతడి స్నేహితుడు షారుక్ ద్వారా బంగారు గూడకు చెందిన గంగాధర్ ను తన కూతుళ్లను విక్రయించేందుకు ఒప్పించారు. మూడు లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.

అనంతరం కర్ణాటకు వెళ్లి పిల్లలను అక్కడ అప్పజెప్పి డబ్బులు తీసుకొని తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత గంగాధర్ పిల్లలను విక్రయించగా వచ్చిన డబ్బులతో ట్రాలీని కొనుగోలు చేశారు. దీంతోనే అసలు బండారం బయటపడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పిల్లలను విక్రయించిన ఘటనలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

కర్ణాటకలోని కుంట కార్వా వద్ద నుండి ఒక శిశువును, సాగర చేగాలి గ్రామం నుండి మరో శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి వ్యవహారం లో పాలు పంచుకున్న ఆర్.ఎం.పి వైద్యుడు డాక్టర్ జగన్నాథ్, అతడి స్నేహితుడు షారూక్, పిల్లల తండ్రి గంగాధర్ ఇంకా వారికి సహకరించిన వారిని అరెస్ట్ చేశారు. ట్రాలీ వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Latest News